కర్ణాటకలో 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ వాయిదా..

కర్ణాటకలో సినిమాను వాయిదా వేసుకుంటున్నట్లు కోర్టుకు చెప్పిన కమల్ తరపు న్యాయవాది..;

Update: 2025-06-03 13:08 GMT
Click the Play button to listen to article

కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన 'థగ్ లైఫ్'(Thug Life) సినిమా రిలీజ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 5న విడుదల కావాల్సి ఉంది. మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలతో కన్నడనాట ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కమల్ క్షమాపణ చెబితేనే సినిమా విడుదలకు అంగీకరిస్తామని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (Karnataka Film Chamber ) తేల్చిచెప్పింది. అయితే అందుకు కమల్ నిరాకరించారు. సినిమా విడుదల కోసం ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కమల్ తరపున సీనియర్ న్యాయవాది ధ్యాన్ చినప్ప కేసు వాదించారు. విచారించిన ఎం నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్..ఏ పౌరుడి మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికి లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పరిస్థితిని చక్కదిద్దడానికి కమల్ క్షమాపణ చెప్పాలని పేర్కొంది. దాంతో చిత్రం విడుదలను కర్ణాటకలో వాయిదా వేసుకుంటున్నట్లు చినప్ప కోర్టుకు తెలిపారు. దీంతో కేసు జూన్ 10 కి వాయిదా పడింది. మరోవైపు కమల్ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చలు జరపడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.

Tags:    

Similar News