‘ఆపరేషన్ పోలో ఓ గొప్ప ఘట్టం’

పటేల్ సమర్థత వల్లే భారత్‌లో హైదరాబాద్ కలిసిందన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.;

Update: 2025-09-17 08:01 GMT

నిజాం పాలనలో రజాకార్లు చేసిన దారుణాలపై ప్రజలు తిరగబడిన చారిత్రాత్మక ఘట్టానికి సెప్టెంబర్ 17 ఒక నిదర్వనమని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం.. భారత్‌లో కలిసిందని గుర్తు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం పాలనలో రజాకార్లు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావన్నారు. వారి అఘాయిత్యాలతో విసిగి వేసారిన ప్రజలు తిరగబడ్డారని అన్నారు. ఆనాడు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో అనేది దేశ చరిత్రలో ఎంతో గొప్ప ఘట్టమని, ఆనాడు తాము ఓడిపోయామని నిజాం రాజు.. పటేల్ ముందు ఒప్పుకున్నారని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. 1947లో భారత దేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో వివిధ రాజ్యాలు ఉండేవని, వాటివల్ల భారతదేశ ఐఖ్యత్వం ఇబ్బందికరంగా ఉండేదని గుర్తుచేశారు. అఖండ భారత్ నినాదంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుకు వెళ్ళారని కేంద్ర మంత్రి తెలిపారు.

ఆపరేషన్ పోలో.. పటే నిర్ణయం..

‘‘ఇచ్చిన హామీని నిజాం నిలబెట్టుకోలేదు. ఆపరేషణ్ పోలో‌తో నిజాంను పటేల్ ఓడించారు. ప్రజలపై రజాకార్లు చేస్తున్న దారుణాలకు చరమగీతం పాడాలని భావించే పటేల్.. ‘ఆపరేషన్ పోలో’ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాలను గాంధీ కూడా మెచ్చుకున్నారు. తుష్టికరణ రాజకీయాల కోసం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. హిందువులే టార్గెట్‌గా రజాకార్లు అత్యాచారాలు, హత్యలు చేశారు. పహల్గాంలో కూడా రజాకార్ల తరహాలోనే హత్య చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో వారికి బుద్ది చెప్పాం’’ అని అన్నారు. ‘‘నిజాం.. భారత్‌కు మాత్రమే వ్యతిరేకం కాదు. భారత ప్రజాస్వామ్య విధానాలకు కూడా వ్యతిరేకం. దేశంలో ఇప్పటికి కూడా రజాకార్లు ఉన్నారు. ధర్మం పేరుతో దేశంలో చీలికలు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ ఏ శక్తి ముందు తలవంచలేదు.. వంచదు.. వంచబోదు..’’ అని వ్యాఖ్యానించారు.

దేశమంటే అంతా ఒకటవుతాం..

‘‘ఎన్ని విభేదాలున్నా దేశం విషయానికి వస్తే అంతా ఒకే మాటపై ఉంటాం. దేశ రక్షణ, భద్రత విషయంలో ప్రజలందరం ఏకతాటిపైకి వస్తాం. ఇప్పుడు భారత్ అంటే సాదాసీదా దేశం కాదు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్‌తో మన సైనికుతుల తమసత్తా చాటారు. ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులను హతమార్చాం. పహల్గాంలో మతం పేరు అడిగి మరీ హత్య చేసిన వారికి బుద్ధి చెప్పాం. ఆపరేషన్ సింధూర్‌తో దేశ భద్రత విషయానికి వస్తే భారత్ ఎలా ప్రతిస్పందిస్తే చూపించాం. దీంతో భారత్ శక్తిసామర్థ్యాలు, సైనిక సత్తాను ప్రపంచం చూసింది. ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి మరీ వారిని హతమార్చాం. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. ఇప్పుడు చిన్న విరామం మాత్రమే ఇచ్చాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది’’ అని ఆయన అన్నారు.

Tags:    

Similar News