విద్యా విధాన ప్రక్షాళన చేయాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు

విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోయింది..;

Update: 2025-09-17 09:23 GMT

తెలంగాణ విద్యావిధానం అంతర్జాతీయ స్థాయికి సరితూగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు రాష్ట్రంలోని ఓపెన్ మార్కెట్ కారణమన్నారు. విద్యావిధానాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, అందుకోసం సమూల మార్పులు, ప్రక్షాళన అవసరమని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై అధికారులతో రేవంత్ సమీక్షించారు. ఇందులో పలు కీలక అంశాలను ఆయన లేవనెత్తారు. నూతన విద్యా పాలసీ ద్వారా విద్యావిధానంలో మార్పులు వస్తాయని, అవి పేదరిక నిర్మూలనకు దోహదపడతాయని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ విద్య లో ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీ లు కీలక పాత్ర పోషించాయని తెలిపారు.

‘‘ఓపెన్ మార్కెట్ కారణం గా అంతర్జాతీయ స్థాయి కి మన విద్యా విధానం సరితూగడం లేదు.. ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. వారి లో 15 శాతం మంది కి మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు.. విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుంది.. విద్యా శాఖ కు 21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుంది .. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం.. విద్యా విధానం లో సమూల మార్పులు తీసుకురావడంమే నా ధ్యేయం.. అందుకు కావాల్సిన సలహాలు,సూచనలు ఇవ్వాలి.. 73 లక్షల మంది యువత కు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యం’’ అని చెప్పారు.

‘‘దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలి.. పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక బద్దం గా పనిచేయాలి.. స్కూల్ ఎడ్యుకేషన్ లో లోపాలు ఉన్నాయి.. 11 వేల ప్రైవేట్ స్కూల్స్ లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్ ఆర్ బీ ఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రి ని కోరాను.. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలి.. విద్య విషయం లో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయం గా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోవడానికైనా నేను సిద్ధం’’ అని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News