ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పై సిట్ సంచలన నిర్ణయం

కేసీఆర్, హరీష్ కు నోటీసులు జారీచేసి అసెంబ్లీ సమావేశాల తర్వాత విచారించాలని సిట్ అధికారులు డిసైడ్ చేశారని సమాచారం

Update: 2025-12-23 06:34 GMT
Telephone Tapping and KCR

టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలకమలుపు తిరగబోతున్నది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ళుగా (Telephone Tapping)ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులు అరెస్టయి ప్రస్తుతం బెయిల్ మీదున్నారు. కీలకపాత్రధారి ఇంటెలిజెన్స్ మాజీ బాస్ టీ ప్రభకరరావును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజా సమాచారం ఏమిటంటే ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి(KCR) కేసీఆర్ ను విచారించేందుకు సిట్ డిసైడ్ అయ్యింది. కేసీఆర్ తో పాటు మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎంఎల్ఏ (Harish Rao)తన్నీరు హరీష్ రావును కూడా విచారించబోతోంది. ఇందుకువీలుగా ఇద్దరికీ సిట్ అధికారులు నోటీసులు జారీచేయబోతున్నట్లు సమాచారం.

కేసీఆర్, హరీష్ ను విచారించాలని సిట్ అధికారులు ఎందుకు సడెన్ గా నిర్ణయించారు ? ఎందుకంటే కస్టడీ విచారణలో ఉన్న ప్రభాకరరావు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, అనీల్ కుమార్ పేర్లను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీళ్ళిద్దరి సిట్ అధికారులు విచారించి వాళ్ళ స్టేట్మెంట్ ను రికార్డు చేసిన విషయం తెలిసిందే. అయితే కీలకపాత్రధారి మహేందర్ రెడ్డి, అనీల్ పాత్రపై ఎలాంటి సమాచారం చెప్పారన్నది ఆసక్తిగా మారింది. తాజాగా ప్రభాకరరావు విచారణలో చెప్పిన విషయాల ఆధారంగానే కేసీఆర్, హరీష్ కు నోటీసులు జారీచేసి విచారణకు పిలిపించాలని సిట్ డిసైడ్ చేసినట్లు తెలిసింది.

కేసీఆర్ హయాంలో వేలాదిఫోన్లు ట్యాపింగ్ జరిగిన విషయం తెలిసిందే. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో నిపుణులు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, ఉన్నతాధికారులు, జడ్జీలతో పాటు వాళ్ళ కుటుంబసభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్ జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కూతురు కల్వకుంట కవిత భర్త అనీల్ కుమార్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేశారు. బీఆర్ఎస్ లోని అనుమానిత నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. దీంతోనే ట్యాపింగ్ అరాచకం మామూలుగా జరగలేదని అర్ధమవుతోంది.

తమప్రత్యర్ధులు లేదా అనుమానితులు అనుకున్న వేలాదిమంది ఫోన్లను మావోయిస్టు మద్దతుదారులు, సింపథైజర్లు అనే ముసుగు వేసేసి వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఈ విషయాలన్నింటినీ అరెస్టయిన నలుగురు పోలీసులు అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతయ్య, భుజంగరావు, ప్రణీత్ రావు సిట్ విచారణలో అంగీకరించారు. అలాగే కోర్టుకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లలో కూడా వివరించారు.

ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలనే ఆదేశాలను ప్రభాకరరావే తమకు ఇచ్చేవారని పై నలుగురు అధికారులు వాచారణలో బయటపెట్టారు. అందుకనే సిట్ అధికారులు ప్రభాకరరావును ఇపుడు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరి ఆదేశాలతో తాను ఫోన్ ట్యాపింగ్ చేయించేవాడిని అన్నవిషయాన్ని ప్రభాకరరావు బయటపెట్టడంలేదు. ట్యాపింగ్ కేసులో పాత్రధారులు, కీలకపాత్రధారి ఎవరనేది తెలిసింది. అసలు సూత్రధారి ఎవరన్నది ప్రభాకరరావు బయటపెట్టడంలేదు. గడచిన నాలుగురోజులుగా ప్రభాకరరావును, అరెస్టయి బెయిల్ మీదున్న నలుగురు పోలీసుల అధికారులను వన్ ఆన్ వన్ పద్దతిలో విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కీలకపాత్రధారి మహేందర్ రెడ్డి, అనీల్ కుమార్ పేర్లను పదేపదే ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది.

ఈ నేపధ్యంలోనే కేసీఆర్, హరీష్ కు నోటీసులు జారీచేసి అసెంబ్లీ సమావేశాల తర్వాత విచారించాలని సిట్ అధికారులు డిసైడ్ చేశారని సమాచారం. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో మంటలుమండటం ఖాయం. విచారణలో మహేందర్ రెడ్డి, అనీల్ కుమార్ చెప్పిన దాని ఆధారంగానే కేసీఆర్, హరీష్ ను విచారించాలని సిట్ అనుకున్నట్లు తెలుస్తోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News