పోలీసుల అదుపులో కన్నూరు ADM ఆత్మహత్య కేసు నిందితురాలు దివ్య

కేరళలోని కన్నూర్ ADM నవీన్ బాబు ఆత్మహత్య కేసులో నిందితురాలయిన CPI(M) నాయకురాలు PP దివ్యను మంగళవారం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-10-29 12:02 GMT

కేరళలోని కన్నూర్ ADM నవీన్ బాబు ఆత్మహత్య కేసులో నిందితురాలయిన CPI(M) నాయకురాలు PP దివ్యను మంగళవారం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు కన్నూర్ సిటీ పోలీస్ కమిషనర్ అజిత్ కుమార్ విలేకరులకు తెలిపారు.

నవీన్ బాబును ఆత్మహత్యకు ప్రేరేపించారని పోలీసులు వివిధ సెక్షన్ల కింద దివ్యపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దివ్య ముందస్తు బెయిల్‌ కోసం అక్టోబర్ 19న తలస్సేరి సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి తలస్సేరి, KT నిస్సార్ అహమ్మద్ ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు.

అసలేం జరిగింది..

కన్నూర్ ADM నవీన్ బాబుకు బదిలీ వీడ్కోలు కార్యక్రమం అక్టోబరు 14న ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేకపోయిన దివ్య హాజరయ్యారు. పెట్రోల్ బంకు ఏర్పాటుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) జారీ చేసేందుకు ఒక వ్యక్తి నుంచి నవీన్ బాబు లంఛం డిమాండ్ చేశారని అందరి ముందు ఆరోపించారు. దాంతో నవీన్ బాబు తీవ్ర మనస్తాపానికి గురైన తన క్వార్టర్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

అందుకే ఆలస్యం..

దివ్యపై కేసు నమోదైనా కస్టడీలోకి తీసుకోవడంలో జరిగిన జాప్యంపై కమిషనర్ స్పందిస్తూ.. కేసు న్యాయ పరిశీలనలో ఉన్నందున అరెస్టు చేయడంలో ఆలస్యం జరిగిందని సమాధానమిచ్చారు. ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

“ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే అది ఖచ్చితంగా సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపినట్లవుతుంది. ముందస్తు బెయిల్‌ను అసాధారణమైన కేసులో మాత్రమే మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. యాంటిసిపేటరీ బెయిల్‌ ఇవ్వడానికి ఇది సరైన కేసు కాదని కోర్టు అభిప్రాయపడింది.

మాకు న్యాయం జరగాలి..

కోర్టు తీర్పుపై నవీన్ బాబు భార్య మంజూష స్పందిస్తూ.. “మా జీవితాలను నాశనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి. న్యాయం కోసం ఎంతకైనా తెగిస్తాం. నేను చెప్పడానికి ఇంకేమీ లేదు. కానీ మేము ఎంతకైనా వెళ్తాం. బంధువులు రాకముందే పోస్ట్‌మార్టం నిర్వహించడంపై కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది’’ అని తహసీల్దార్ మంజూష పేర్కొన్నారు.

Tags:    

Similar News