కేరళ: అలతూర్ కోసం కాంగ్రెస్, లెఫ్ట్ హోరాహోరీ పోరు.. విజయం ఎవరిదంటే?
కేరళ లో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన అలత్తూర్ లో గెలుపు కోసం కాంగ్రెస్, వామపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే
By : Rajeev Ramachandran
Update: 2024-04-11 06:13 GMT
ఇండి కూటమిలో ప్రధాన భాగస్వాములు అయినా సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు రెండు, కేరళ లో మాత్రం ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. ఎలాగైన మెజారిటీ స్థానాలు సాధించాలని రెండు పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాయి. వారు నిత్యం ప్రజల్లో ఉంటూ తన పార్టీ విధానాలు, హమీలు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు.
అలత్తూర్ లో..
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటున్న నేపథ్యంలో కేరళలోని అలత్తూర్ లోక్‌సభలో 38 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రమ్య హరిదాస్ ఓపెన్ జీపులో చెలక్కర అసెంబ్లీ సెగ్మెంట్‌లో పర్యటిస్తూ కార్నర్ మీటింగ్‌లలో పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. రెండో సారి ఎంపీగా గెలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రచారంలో దాదాపు 62 పాయింట్ల వద్ద ఆగి అక్కడి ప్రజలతో మాట్లాడారు. మూడు నుంచి ఐదు నిమిషాలు ప్రసంగాలు చేశారు.
ఫెడరల్ ఆమెను గ్రామీణ త్రిస్సూర్‌లోని అరన్‌గొట్టుకర వద్ద కలుసుకుంది. అర డజను పాయింట్ల వద్ద రమ్య ప్రసంగాలను వింది. ప్రతి చోటా 15 నుంచి 25 మంది కార్యకర్తలు ఆమె కోసం ఆసక్తిగా ఎదురూ చూస్తూనే ఉన్నారు.
ఆత్మవిశ్వాసంతో రమ్య
'మరోసారి విజయం సాధిస్తానన్న నమ్మకం నాకుంది. నాకు ఓటర్లపైన కూడా అంతే నమ్మకం ఉంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిణామాలు నా అభ్యర్థిత్వానికి శుభసూచకం'' అని రమ్య అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని, దాని విభజన విధానాలను ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించాలని ఓటర్లకు నమ్మకంగా చెబుతున్నామని ఆమె తెలిపారు. ఇందులో సీపీఐ(ఎం), వామపక్షాలకు ఎలాంటి పాత్ర లేదు. ఓటర్లకు అంతా తెలుసు. నా ప్రత్యర్థి గురించి నేను బాధపడను. ”
దేశమంగళానికి చెందిన కిరాణా షాపు యజమాని మహమ్మద్ కుట్టి ఆమె వాదనతో ఏకీభవించారు. "రమ్య తన విజయాల పరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉంది," అని అతను ఫెడరల్‌తో చెప్పాడు. "ఆమె చాలా తక్కువ స్థాయి వ్యక్తి, చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆలత్తూరు ఓటర్లకు కాంగ్రెస్ నేతలు ఆమెను చెల్లెలుగా పరిచయం చేశారు. ఆమె మనలో ఒకరని ఇప్పటికే నిరూపించుకుంది. ” అని ఫెడరల్ తో అన్నారు.
లెఫ్ట్ నుంచి సీనియర్ మంత్రి బరిలో..
మరోవైపు, కేరళలో మంత్రివర్గంలో షెడ్యూల్డ్ కులాలు- తెగల మంత్రి కె. రాధాకృష్ణన్ ను పార్టీ బరిలోకి దింపింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉంది.
రాధాకృష్ణన్, కేరళలో అత్యంత పారదర్శకమైన రాజకీయ నాయకులలో ఒకరిగా పేరు పొందారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. దళిత సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1996 నాయనార్ మంత్రివర్గంలో అతి పిన్న వయసులోనే మంత్రి అయ్యాక పాలనలో తనదైన ముద్ర వేశారు. వామపక్ష-ఉదారవాద వర్గాలలో చాలామంది ఆయనను కాబోయే ముఖ్యమంత్రిగా కూడా చూస్తున్నారు.
కె రాధా కృష్ణన్ 2021లో చెలక్కర నుంచి కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు, 54 శాతానికి పైగా ఓట్లు 39,400 మెజారిటీతో గెలుపొందారు. సంస్థాగత బాధ్యతల కారణంగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న 2006 మినహా 1996 నుంచి వరుసగా పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో గెలుపొందారు. ఇది అతని ఐదవ విజయం. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు.
మార్క్సిస్టుల ప్రచారం
ఈయనకు బలమైన క్యాడర్, మార్క్సిస్టు మూలాలు ఉండడంతో ప్రచారంలో తనదైన ముద్ర వేస్తూ సాగుతున్నారు. ఫెడరల్ ఆయన కాన్వాయ్‌ని నెన్మారా వద్ద కలుసుకుంది, ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతం, ఇక్కడ ఓటర్లలో రైతులు ఎక్కువశాతం ఉన్నారు. నియోజకవర్గం తమిళనాడుతో సరిహద్దును పంచుకుంటుంది ఆయన కార్నర్ సమావేశాల్లో ఎక్కువగా మహిళామణులు దర్శనమిస్తున్నారు.
“వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధిగా నా అధికారాన్ని దుర్వినియోగం చేయనని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ రాష్ట్రంలో నేను గత ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసినప్పటి నుంచి మీకు ఇది బాగా తెలుసు, ”అని రాధాకృష్ణన్ ప్రచారానికి వెళ్లిన సమయంలో రాధాకృష్ణన్ చేసిన ప్రచారం ఇది.
అలత్తూరు యుద్ధభూమి
కృష్ణమ్మ అనే ఒక మహిళ ఇలా అన్నారు: “ఈసారి, మేము ఖచ్చితంగా గెలుస్తాము, కానీ మేమే ఓడిపోతాం. ఎందుకంటే ఆయన గెలిస్తే ఎంపీగా ఉంటారు. మంత్రివర్గంలో ఆయనను చూడలేం. నాలాంటి మహిళలతో చాలా స్నేహపూర్వకంగా ఉన్న (రాష్ట్ర) మంత్రి. అణగారిన వారి జీవితం ఏమిటో ఆయనకు తెలుసు.” దళిత వ్యవసాయ కూలీల కొడుకుగా రాధాకృష్ణన్ నిరాడంబరమైన నేపథ్యాన్ని ఆమె ప్రస్తావించారు.
పాలక్కాడ్ -త్రిస్సూర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న అలత్తూర్ 2008లో ఒట్టపాలెం లోక్‌సభ నియోజకవర్గం నుంచి విభజించబడింది. 1989 - 1991లో కూడా ఒట్టపాలెం నుంచి మాజీ రాష్ట్రపతి KR నారాయణన్ ఎన్నికైయ్యారు. 1993లో సీపీఐ(ఎం)కు చెందిన అంతగా తెలియని ఎస్ శివరామన్ కాంగ్రెస్ హెవీవెయిట్ కెకె బాలకృష్ణన్‌పై 132,764 ఓట్ల తేడాతో గెలుపొందడంతో నియోజకవర్గంలో నిజమైన రాజకీయ మార్పు జరిగింది.
బాబ్రీ అనంతర సంవత్సరాలు
బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఫలితం అది. అయితే ఆ తరువాత ముస్లింలు కాంగ్రెస్ కు స్థిరమైన ఓటు బ్యాంకుగా ఉంది. అప్పటి నుంచి, ఒట్టప్పలం తరువాత అలత్తూరు, 2009 నుంచి, వామపక్షాలకు, ముఖ్యంగా సిపిఐ(ఎం)కి బలమైన కోటలుగా నిలిచాయి, 2019 లో మాత్రం కాంగ్రెస్ ఇక్కడ జెండా పాతింది. యువ కాంగ్రెస్ నాయకురాలు రమ్య హరిదాస్ ప్రస్తుత ఎంపీ పీకే బిజును 1,58,968 ఓట్ల తేడాతో ఓడించారు, ఇది ఎల్‌డిఎఫ్‌కి పూర్తిగా ఊహించని విధంగా జరిగింది.
శబరిమల, రాహుల్..
శబరిమల పై సుప్రీంకోర్టు తీర్పుతో హిందూ సమాజం మొత్తం వామపక్షాలకు ఎదురుతిరిగింది. అలాగే కేరళ నుంచి రాహూల్ గాంధీ పోటీ చేయడంతో మైనారిటీల ఓట్ల ఏకీకరణ జరిగి ఎల్డీఎఫ్ కు తీరని నష్టం జరిగింది.
కేరళ కేంద్ర కష్టాలు
రైతులు, వ్యవసాయ కూలీలు అధికంగా ఉండే కేరళలోని నియోజకవర్గాల్లో అలత్తూరు ఒకటి. అయితే ఎల్డీఎఫ్ కూటమి ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభం, వరి సేకరణ బకాయిలు పెను సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారు.
“ఈ నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రచారం అంతా కేంద్ర ప్రభుత్వంలో మేము ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి గురించే. గత ఐదేళ్లుగా, వరి సేకరణ బకాయిలు ఆలస్యం కావడం పై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము, ఈ సమస్యకు మాపై నిందలు వేస్తూ యుడిఎఫ్ చేసిన ప్రచారం దీనికి తోడైంది. అదేవిధంగా సంక్షేమ పింఛన్ల పంపిణీ సవాళ్లను ఎదుర్కొంది’’ అని నెన్మరల ఎమ్మెల్యే కె.బాబు అన్నారు. అయితే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. కేంద్ర బకాయిల క్లియరెన్స్ ప్రారంభం అయింది. పెన్షన్ల పంపిణీ సమస్యను కూడా త్వరలోనే అధిగమిస్తాం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎన్ సరసు పేరును ప్రతిపాదించింది
"ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం"
రాధాకృష్ణన్ ఫెడరల్‌తో మాట్లాడుతూ.. “ఈ ఎన్నికలు అంతిమంగా మన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం జరుగుతున్నవి. ఇది సామాన్య ప్రజలకు తెలుసు. బీజేపీని సమర్థవంతంగా సవాలు చేయడంలో కాంగ్రెస్ అసమర్థతను ఎత్తిచూపడంపై మా ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం.
కాంగ్రెస్ మృదు హిందుత్వ కార్డును ఆడుతోందని ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తున్నారు, అయోధ్య వంటి సమస్యలపై వారి వైఖరిని బట్టి తెలుస్తుంది. వారి మ్యానిఫెస్టో నుండి CAAని తొలగించడం ఈ అవగాహనను మరింత బలపరుస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్‌షో నుంచి బీజేపీకి చెందిన ఏకైక ముస్లిం అభ్యర్థి డాక్టర్ అబ్దుల్ సలామ్‌ను పక్కన పెట్టడం మేము గమనించాం అని సీపీఐ(ఎం) రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు.
"భావోద్వేగ సమస్యలు"
CPI(M)-LDF తమ నాయకత్వంలోని అవినీతి, కరువనూరు బ్యాంకు కుంభకోణం, ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం వంటి సమస్యల నుండి దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నాయని రమ్య హరిదాస్ విమర్శించారు. సీఏఏ పై కాంగ్రెస్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. అయినప్పటికి అదే అంశం ప్రచారం చేసి భావోద్వేగాలు సృష్టించేందుకు కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారన్నారు.
బీజేపీ అభ్యర్థిగా ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎన్ సరసు పేరును ప్రతిపాదించింది. పాలక్కాడ్‌లోని విక్టోరియా కాలేజీలో సీపీఐ(ఎం) విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు కాలేజీ క్యాంపస్‌లో సమాధిని ఎత్తుకుని పదవీ విరమణ చేసిన తర్వాత ఆమరణ దీక్ష చేయడంతో ఆమె ప్రజల దృష్టిని ఆకర్షించింది.