అర్ధ శతాబ్దం అయినా వలసలపై పాఠాలు నేర్వలేదు

కువైట్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి పదుల సంఖ్యలో భారతీయలు మృత్యువాత పడ్డారు. దేశంలోకి రెమిటెన్స్ పరంగా అత్యధిక ఆదాయం పంపుతున్న వలసదారుల బతుకులు మాత్రం..

Update: 2024-06-16 06:11 GMT

కేరళ రాజధాని తిరువనంతపురంలోని లోక కేరళ సభలో కేరళ మైగ్రేషన్(వలసలు) సర్వే నాలుగో ఎడిషన్ ఆవిష్కరిస్తున్న సమయంలోనే అంటే జూన్ 14 వ తేదీనే కువైట్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 24 మంది మలయాళీ కార్మికులు ఈ ప్రమాదంలో మరణించగా, వారికి వారి ఆత్మీయ బంధువులు అంత్యక్రియలు చేస్తున్నారు.

ఈ నాన్ రెసిడెంట్ కేరళీయులు సర్వేలో ప్రదర్శించిన గణాంకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేరళ ఆర్ధిక వ్యవస్థకు వీరే ములాధారం అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇది కేరళకు సంభవించ బోయే భవిష్యత్ నష్టాలను తెలియజేస్తోంది. వీరంతా అర్ధశతాబ్దానికి పైగా రాష్ట్ర, దేశ ఆర్ధిక వ్యవస్థకు రెమిటెన్స్ రూపంలో తమవంతు సాయం అందిస్తూనే ఉన్నారు.
పాఠాలు నేర్చుకోలేదు
"ఈ సంక్షోభాలు వలస ఆధారిత దేశాలలోని వలసదారుల హక్కులు, భద్రత, అక్కడి పని పరిస్థితులను తెలియజేస్తున్నాయని, అవి పరిష్కరించడంలో దీర్ఘకాలిక ఉదాసీనత కనిపిస్తోందని" అని అంతర్జాతీయ వలసలు, అభివృద్ధి సంస్థ (IIMD) చైర్ డాక్టర్ ఎస్ ఇరుదయరాజన్ ఈ గణాంకాల డాక్యుమెంట్ విడుదలకు ముందు ఒక వ్యాసంలో రాశారు.(IIMD KMS అధ్యయనాన్ని నిర్వహించింది.)
" ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోలేనది సూచిస్తుంది. వలస సమస్యలు క్షణిక దృష్టిలో మాత్రమే ఉంటాయి. అక్కడ ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నంత వరకు చర్చనీయాంశాలుగా ఉంటాయి" అని ఇరుదయరాజన్ అన్నారు.
" ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయల గమ్యస్థానాలు తీసుకుంటే, ముఖ్యంగా అందులో పశ్చిమ ఆసియాలో భారతీయ వలసలు తీసుకుంటే వారి భద్రతను, శ్రేయస్సును నిర్ధారించడానికి మాకు ఆలోచించదగిన, సమర్థవంతమైన విధానాలు అవసరం" అన్నారాయన.
సంఖ్యలు చూసుకుంటే..
KMS 2023 ప్రకారం, కేరళ నుంచి వలస వెళ్లిన వారి సంఖ్య 2.2 మిలియన్లుగా ఉంటుందని ఒక అంచనా, 2018 లో ఈ సంఖ్య 2.1 మిలియన్లుగా ఉంటుందని లెక్కలు వేశారు. అంతకుముందు దశాబ్దంలో ఈ వలసలు కాస్త తగ్గిన, గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వలసలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఇది కొంచెం ఆసక్తికరమైన అంశం. 2023లో 32,388 మంది వలసదారులు అంతకుముందు ఏడాదితో పోల్చితే పెరిగారు. 2018 తో పోల్చితే కేరళలోని 14 జిల్లాలోని తొమ్మిది జిల్లాల నుంచి వలసదారుల సంఖ్య తగ్గింది.


 


విద్యార్థుల వలస
"KMS చేసిన ఈ రౌండ్‌లో వలసల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడంతో 2023 లో వలసల సంఖ్య స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. 2018 లో ఈ సంఖ్య 1,29,763 ఉండగా, 2023 నాటికి ఈ సంఖ్య 2,50, 000 కు చేరింది.
"విద్యార్థుల వలసలలో ఈ చెప్పుకోదగ్గ పెరుగుదల కేరళ నుంచి వలస వచ్చిన వారి జనాభాలో గణనీయమైన మార్పును చెబుతుంది, ఇందులో 17 సంవత్సరాల వయస్సులోనే వలస వెళ్ళేవారి సంఖ్య పెరిగింది. "కేరళ నుంచి వచ్చిన మొత్తం వలసదారులలో 11.3 శాతం మంది విద్యార్థులు ఉన్నారని KMS 2023 వెల్లడించింది, ముఖ్యంగా విదేశాలలో విద్యావకాశాల కోసం యువకులు వలస వెళ్ళడానికి ఎంచుకుంటున్నారని ఈ సర్వే సూచిస్తుంది".
గమ్యస్థాన దేశాలు
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సభ్యులు బలమైన కారిడార్‌గా ఉండటంతో, గమ్యస్థాన దేశాలు కూడా సంవత్సరాలుగా ఈ వలస మార్పులను చూశాయి. KMS సర్వే ప్రకారం గత కొన్ని రౌండ్ల డేటా చూస్తే వలస దారులు గమ్యస్థానం ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి యూఏఈ కి మారింది. 2023 లో కూడా యూఏఈ ఈ స్థానాన్ని నిలుపుకుంది.
అయితే, GCC దేశాలను ఎంచుకునే వలసదారుల సంఖ్య 2018లో 89.2 శాతం నుంచి 2023లో 80.5 శాతానికి తగ్గింది. అదే సమయంలో, GCC యేతర దేశాలను ఇష్టపడే వలసదారుల సంఖ్య 10.8 శాతం నుంచి 19.5 శాతానికి చేరుకుంది. ఈ మార్పుకు కారణం విద్యార్థులు ఉన్నత విద్య కోసం జీసీసీ దేశాలను కాకుండా ఇతర దేశాలను ఎంచుకోవడం ఓ కారణం కావచ్చు.
మలప్పురం- ఇడుక్కి
మలప్పురం జిల్లాలోని తిరుర్ తాలూకా వలసదారుల సంఖ్యలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక్కడి నుంచి 2023లో 1,00,000 కంటే ఎక్కువ మంది వలసగా వెళ్లారు. ఎక్కువ మంది వలసలు కొనసాగించే సంప్రదాయం ఉన్న ఈ ప్రాంతం దాన్ని కొనసాగించింది.
మరోవైపు, ఇడుక్కి జిల్లాలోని దేవికులం తాలూకాలో అత్యల్ప వలసలు నమోదయ్యాయి. కేరళ ఉత్తర ప్రాంతం వలసలకు కేంద్ర బిందువుగా ఉంది, ఎక్కువ మంది వలసదారులు ఇక్కడ నుంచే ఉన్నారు. కేరళ నుంచి వలస వెళ్తున్న వారి మతపరమైన వివరాలు తీసుకుంటే ముస్లింలు 41. 9 శాతంతో ముందు వరుసలో ఉన్నారు. తరువాత హిందూవులు 35. 2 శాతం, క్రైస్తవులు 22.3 శాతం ఆక్రమించారు.
మహిళలు
మహిళా వలసదారుల నిష్పత్తి 2018లో 15.8 శాతం నుంచి 2023లో 19.1 శాతానికి పెరిగింది. స్త్రీల వలసలు GCC దేశాల నుంచి యూరప్, ఇతర పాశ్చాత్య దేశాలకు 40.5 శాతంగా మారాయి. అయితే, పురుషులలో ఈ సంఖ్య 14.6 శాతంగా ఉంది. విద్య పరంగా, వలస వచ్చిన స్త్రీలలో 71.5 శాతం మంది డిగ్రీ స్థాయి విద్యను పూర్తి చేసినట్లు వివరాలు ఉన్నాయి. ఇది పురుషులు వలస వచ్చిన వారిలో 34.7 శాతం మాత్రమే డిగ్రీ పూర్తి చేసినట్లు తేలింది.
పురుష వలసదారులు కేరళ నుంచి వలసలపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు, పురుషులు - ఆడ వలసదారుల మధ్య అంతరం కొట్టాయంలో అతి తక్కువగా ఉండగా, మలప్పురంలో విస్తృతంగా ఉంది.
రెమిటెన్స్‌లలో పెరుగుదల
KMS 2023 ప్రకారం, కోవిడ్ మహమ్మారి తర్వాత కేరళకు మొత్తం చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. మొత్తం చెల్లింపులు 2018లో రూ. 85,092 కోట్ల నుంచి 2023లో రూ. 2,16,893 కోట్లకు చేరాయి, ఇది 154.9 శాతం వృద్ధిని సాధించినట్లు సూచిస్తుంది.
వచ్చిన రూ. 2,16,893 కోట్ల రెమిటెన్స్‌లు 3.549 కోట్ల జనాభాకు లెక్కేస్తే తలసరి రూ. 61,118 రెమిటెన్స్‌ని సూచిస్తున్నాయి. కేరళకు చెల్లింపులు సంవత్సరాలుగా పెరుగుతున్నప్పటికీ, ఈ చెల్లింపులను స్వీకరించే కుటుంబాల సంఖ్య 2018లో 16 శాతం ఉన్న కుటుంబాల నుంచి 2023 నాటికి 12 శాతానికి తగ్గింది.
NRI డిపాజిట్లు
భారత్ NRI డిపాజిట్లలో కేరళ నుంచి 21 శాతం వాటా ఉంది. ఇది 2019 నుంచి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెమిటెన్స్‌లు రాష్ట్ర ఆదాయ రశీదు కంటే 1.7 రెట్లు ఎక్కువ.
చెల్లింపుల్లో అత్యధిక వాటాను ముస్లిం కుటుంబాలు పొందుతూనే ఉన్నాయి, ఇందులో వీరి వాటా 40.1 శాతం, హిందూ కుటుంబాలు 39.1 శాతం, క్రైస్తవ కుటుంబాలు 20.8 శాతం వాటాను అందుకుంటున్నాయి.
కేరళకు సమస్యలు..
KMS 2023 ద్వారా బయటపడిన మరో విషయం ఏమిటంటే ఇది కేరళ జనాభా స్వరూపాన్ని మార్చి వేస్తోంది. ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీనికి అనేక విధానపరమైన జోక్యాలు కారణమవుతున్నాయని ఇరుదరాజన్ అంటున్నారు.
"ఒక చెప్పుకోదగ్గ ధోరణి విద్యార్థుల వలసలలో నాటకీయ పెరుగుదల, గత ఐదేళ్లలో విద్యార్థుల వలసల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. భవిష్యత్ విద్యార్థుల వలసదారులకు సురక్షితమైన వలస మార్గాలను నిర్ధారించే వనరులను అందించడం తక్షణ అవసరం. ”
“కేరళ జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది వలసదారులు ఉన్నప్పటికీ, వారి నిజమైన సామర్థ్యాన్ని వెలికితీయడంలో మేము పూర్తిగా విజయం సాధించలేకపోయాము. 5 మిలియన్ల మంది మలయాళీలు ఉన్న డయాస్పోరాతో, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నెలకొల్పిన ఉదాహరణను అనుసరించి మైగ్రేషన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది, ”అన్నారాయన.
ప్రీ-COVID స్థాయి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజనన్, KMS 2023ని విడుదల చేస్తూ ఇలా అన్నారు: “వలసదారులపై స్పష్టమైన డేటా లేకపోవడం ఈ సమూహానికి సమర్థవంతమైన విధాన రూపకల్పనకు అవరోధంగా ఉంది. ఈ నేపథ్యంలో కేరళ మైగ్రేషన్ సర్వే నిర్వహించారు.
"ఇప్పుడు, కేరళ నుంచి వలసలు తిరిగి 2018 స్థాయికి చేరుకున్నాయని మేము చూస్తున్నాము, ఇది కోవిడ్ మహమ్మారి వంటి ప్రతికూల పరిస్థితులలో కూడా మలయాళీల వలసలు కొనసాగుతూనే ఉన్నాయని సూచిస్తున్నాయి." అన్నారాయన.


Tags:    

Similar News