కేరళలో ‘కోల్డ్రిఫ్’ బ్యాన్..
ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్..
కేరళ(Kerala) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో దగ్గు మందు సిరప్ ‘కోల్డ్రిఫ్’ పంపిణీని తక్షణం నిలిపేయాలని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Veena George) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిరప్‌ను తాపడం వల్ల ఇటీవల మధ్యప్రదేశ్‌లో 9 మంది, రాజస్థాన్‌లో 2 పిల్లలు మృత్యువాతపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు సప్లయ్ చేసే పంపిణీ కేంద్రాలకు కూడా సమాచారం ఇచ్చామని మంత్రి తెలిపారు. ఇప్పటికే నిల్వఉన్న ‘కోల్డ్రిఫ్’ సిరప్‌తో పాటు మిగతా దగ్గు మందు సిరఫ్ శ్యాపిళ్లను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపామని చెప్పారు. రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వైద్యులు దగ్గు సిరప్ సూచించరాదని సెంట్రల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. మూత్రపిండ వ్యాధితో చనిపోయిన పిల్లలు మరణానికి కోల్డ్రిఫ్‌లో 'బ్రేక్ ఆయిల్ ద్రావకం' కలిసి ఉండడమే కారణమని కాంగ్రెస్(Congress) సీనియర్ నాయకుడు కమల్ నాథ్ (Kamalnath) ఆరోపించారు.