అన్భుమణి విషయంలో పీఎంకే చీఫ్ కీలక నిర్ణయం..

ముకుందన్‌కు పార్టీలో కీలక పదవి కట్టబెట్టినప్పటి నుంచి తండ్రీకొడుకుల మధ్య విభేధాలు..;

Update: 2025-09-11 08:30 GMT
Click the Play button to listen to article

పట్టాలి మక్కల్ కట్చి (PMK) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎస్. రామదాస్(S Ramadoss) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్‌(Anbumani Ramadoss)ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు(Tamil Nadu)లోని విల్లుపురంలో ఈ ప్రకటిన చేశారు. సీనియర్ల సలహాలను పట్టించుకోకపోవడం పార్టీ భవిష్యత్తుపై తీవ్రప్రభావం చూపుతుందన్నారు. కొడుకుతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవడమే మంచిదన్న పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రామదాసు చెప్పుకొచ్చారు. అన్భుమణి వెంట ఉన్న వారు ఎవరైనా తిరిగి తన వద్దకు రావొచ్చని కూడా చెప్పారు.

అన్బుమణి బహిష్కరణ గురించి పీఎంకే ప్రతినిధి పి స్వామినాథన్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకోలేదని, గత రెండు నెలలుగా అన్నీ ఆలోచించే రామదాసు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.


‘అన్ని ఆలోచించే తీసుకున్న నిర్ణయం..’

"మా పార్టీ నాయకుడు రామదాస్ అన్ని నిబంధనలు పాటించారు, గతంలో పార్టీ నుంచి ఎవరినైనా తొలగించే ముందు పాటించాల్సిన నిబంధనలన్నీ అన్భుమణి విషయంలో తీసుకున్నారు. రెండుసార్లు షో-కాజ్ నోటీసు చేశారు. వివరణ ఇవ్వడానికి తగినంత సమయం ఇచ్చినా..అన్బుమణి నుంచి ఎలాంటి స్పందనలేదు," అని స్వామినాథన్ చెప్పారు.


‘అన్భుమణి నుంచి నో రెస్పాన్..’

అన్బుమణి బహిష్కరణ పార్టీని రెండుగా చీలుస్తుందా అని అడిగిన ప్రశ్నకు.."మా అయ్యా పలుమార్లు పార్టీ నాయకులతో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన కొడుకు కంటే పార్టీకి ప్రాధాన్యం ఇస్తారు. పార్టీ భవిష్యత్తు ఆయనకు ముఖ్యం. కేంద్ర మంత్రిగా, పార్లమెంటేరియన్‌గా రెండు సార్లు పనిచేసినా.. పార్టీ అభివృద్ధికి అన్బుమణి దోహదపడలేదు. తమిళనాడు (Tamil Nadu)లో 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మా అయ్యా సరైన నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది కార్యకర్తలు మాత్రమే పార్టీని వదిలి వెళ్లి ఉండవచ్చు. వారికి రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదు" అని అన్నారు.


విభేదాలకు కారణమేంటి?

2024 సంవత్సరం చివర్లో రామదాస్ తన మనవడు ముకుందన్‌ను కీలక పదవి కట్టబెట్టారు. పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు. ఇది అన్బుమణి రామదాస్‌కు ఏ మాత్రం ఇష్టంలేదు. పుదుచ్చేరిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తండ్రి నిర్ణయాన్ని అన్బుమణి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి తండ్రీకొడుకుల మధ్య వైరం మొదలైంది.

ఇదిలా ఉండగా.. పార్టీ అధ్యక్షుడిని నేనంటే నేనని తండ్రీకొడుకులు వాదులాడుకుంటున్నారు. రామదాస్ తానే పార్టీ చీఫ్ అని చెబుతుండగా.. నిబంధనల ప్రకారం పార్టీ కార్యవర్గ సభ్యులు తనను ఎనుకున్నందున తానే అధ్యక్షుడినని అన్బుమణి అంటున్నారు.

Tags:    

Similar News