వయనాడ్‌లో 5వ రోజు కొనసాగుతోన్న సహాయక చర్యలు..

కేరళలోని వయనాడ్ జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యలు శనివారానికి ఐదో రోజుకు చేరుకున్నాయి.

Update: 2024-08-03 07:05 GMT

కేరళలోని వయనాడ్ జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యలు శనివారానికి ఐదో రోజుకు చేరుకున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో కొన్ని ఇళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బదిన్నాయి. చాలా ఇళ్లును మట్టి కప్పేసింది. ఇప్పటివరకు 300 మందికి పైగా చనిపోయారు. 200 మంది జాడ తెలియరాలేదు. ఆర్మీ, పోలీస్, ఎన్‌డీఆర్‌ఎఫ్, వలంటీర్లు మొత్తం 1,300 మంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ముండక్కై, చూరల్‌మల ప్రాంతాలలో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిథిలాల కింద ఉండిపోయిన మృతదేహాలను వెలికితీయడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, కాడవర్ డాగ్ స్క్వాడ్‌లను కూడా వినియోగిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న వారికి తక్షణం వైద్యం అందించేందుకు వీలుగా వైద్య నిపుణులతో కూడిన అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.  

Tags:    

Similar News