మైనర్ బాలికను అత్యాచారం చేసిన మైనర్లపై పోక్సో కేసు

కూతురు ఇంట్లోనే ఒంటరిగా ఉంది. ఇదే అదను అనుకుని ఐదుగురు విద్యార్థులు ఇంట్లో జొరబడి అత్యాచారం చేశారు.;

Update: 2025-08-01 13:55 GMT

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఐదుగురు మైనర్లపై జడ్చర్ల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఐదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థి ఉన్నారు. ఐదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు అత్యాచారం చేయడం సంచలనంగా మారింది. జడ్చర్ల మున్సిపాలిటీలో ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో దంపతులు నివాసముంటున్నారు. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న పెద్దకూతురును తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ సమయంలో తండ్రి పని మీద బయటకు వెళ్లాడు. చిన్న కూతురు ఇంట్లోనే ఒంటరిగా ఉంది. ఇదే అదను అనుకుని ఐదుగురు విద్యార్థులు ఇంట్లో జొరబడి అత్యాచారం చేశారు. మూడు రోజుల నుంచి బాలిక అనారోగ్యంతో ఉండటంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు బాలికపై అత్యాచారం జరిగినట్టు తేల్చారు. వైద్యులు తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.బాలికను నిలదీయగా అసలు విషయం తల్లికి చెప్పేసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులపై పోక్సో , అత్యాచారం కేసులు నమోదు చేశారు.

ఈ సంవత్సరం మార్చిలో హైదరాబాద్ గచ్చిబౌలిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసింది మైనర్ బాలురే. బాలిను ముగ్గురు బాలురు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ముగ్గురు పిల్లల్లో ఒకడు మైనర్ బాలికను ప్రేమించేవాడు. ప్రేమ పేరుతో ఆమె వెంట పడ్డాడు. ఆమె నిరాకరించడంతో నిందితుడు మార్ఫింగ్ ఫోటోలతో బాలికను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన విజువల్స్ తో తన సెల్ ఫోన్ లో నిక్షిప్తం చేసుకున్నాడు. తన ఇద్దరు మిత్రులతో ఒకరికి ఈ రికార్డు వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోను పట్టుకుని బాలిక వద్ద రెండో నిందితుడు బ్లాక్ మెయిల్ చేశాడు. తర్వాత బాలిను అత్యాచారం చేశాడు.అత్యాచారం చేసిన బాలుడి దగ్గర బాధిత బాలిక ఘర్షణ పడింది. అతని వద్ద ఉన్నసెల్ ఫోన్ లాక్కొని బాలిక పగుల గొట్టింది. వాళ్లు ఘర్షణ పడుతున్న సమయంలో మూడో మిత్రుడు ఈ సెల్ ఫోన్ పట్టుకెళ్లిపోయాడు. ఆ వీడియోను బాలికకు చూపించి తాను అత్యాచారం చేశాడు. ఒకరి తర్వాత ఒకరు బ్లాక్ మెయిల్ చేసిన విషయాన్ని బాలిక స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది.

రెండేళ్ల క్రితం హైదరాబాద్ కార్ఖానాలో 15 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు మైనర్ బాలురు నెలలతరబడి అత్యాచారం చేశారు. కార్కానా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు.

Tags:    

Similar News