పెరుగుతున్న ఆవుల కిడ్నాప్‌లు..

మనుషులనే కాదు ఆవులను కూడా వదలకుండా కిడ్నాప్‌లు చేసే ముఠాలు ఏర్పడ్డాయి.;

Update: 2025-08-02 08:55 GMT

సికింద్రాబాద్ లో ఆవులను దొంగిలించే ముఠా ఒకటి పట్టుబడింది. దొంగిలించిన ఆవులను ఇన్నోవాకారులో తరలిస్తున్నట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. దీంతో విషయం బయటకు పొక్కింది. రోడ్ల మీద తిరిగే ఆవులకు మత్తు మందు ఇచ్చి ఇన్నోవా కారు వెనక భాగంలో ఎక్కించి తరలిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిన్న రాత్రి మారేడ్ పల్లిలో ఆవులను ఈ ముఠా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆవుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో సిసీటీవీ రికార్డు బయటపడింది. ఆవులను తరలించే ముఠా కోసం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇన్నోవా కారులో ఆవులను తరలించే ముఠా ఎక్కడికి తరలిస్తుంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత మే నెలలో సూర్యపేట నుంచి మఠంపల్లి చౌరస్తా వద్ద 26 ఆవులను కంటైనర్ లో తీసుకెళ్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆవులను ఎపి కి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ లో 15 ఆవులు ఊపిరాడక చనిపోయాయి. రెండు ఆవులు కాళ్లు విరిగిపోయిన స్థితిలో కనిపించాయి. ఆవులు పల్నాడు జిల్లా గురజాలకు చెందినవిగా పోలీసులు చెప్పారు. తొమ్మిది ఆవులను నల్గొండ గోశాలకు అధికారులు తరలించారు. తమిళనాడుకు చెందిన ముఠా ఒకటి ఆవులను దొంగిలిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కంటైనర్ ను ఆపి తనిఖీలు చేస్తే అరటి గెలలు పైన కప్పి క్రింద చెక్కలతో ఓ సెటప్ చేసి ఆవులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

‘‘గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం లేదు’’ అని తెలంగాణ గోశాల ఫెడరేషన్ అధ్యక్షులు మహేశ్ కుమార్ అగర్వాల్ ‘‘ఫెడరల్ తెలంగాణ’’కు చెప్పారు. ‘‘ఈ చట్టం ప్రకారం గోవులను ఎట్టి పరిస్థితులలో ఉద్దెశపూర్వకంగా చంపకూడదు. మిగిలిన పశువులను అంటే ఎద్దు, దున్న,గేదె మొదలైనవాటిని చంపాలంటే , వాటి వయస్సు ఖచ్చితంగా 14 సంవత్సరాలు దాటి వుండాలి’’ అని ఆయన చెప్పారు.

‘‘వ్యవసాయానికి, బ్రీడ్ డెవలప్మెంటకి పూర్తిగా నిరుపయోగంగా వున్నాయని, ప్రభుత్వము నియమించిన పశు వైద్యుడు సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుది’’అని అగర్వాల్ చెప్పారు. ప్రభుత్వ వైద్యుడి సర్టిఫికేట్ ఉన్నప్పటికీ, వాటిని ప్రభుత్వ అనుమతి వున్న కబేళా (పశువధశాల)లలో మాత్రమే వధించాలి అని ఆయన అన్నారు. ‘‘రోడ్డులపై, ఇండ్లల్లో, ఎక్కడ పడితే అక్కడ పశువులను వధించడం, మాంసాన్ని విక్రయించడం నేరం’’ అని అధ్యక్షులు చెప్పారు. ఈ యొక్క యాక్ట్ కాగ్నిజబుల్ (Cognizable) నేరం కింద వస్తుందని అగర్వాల్ చెప్పారు.

కూరగాయల మార్కెట్లే ముఠా టార్గెట్

‘‘గోవులను తరలించే ముఠాలు ఎక్కువగా పెద్ద పెద్ద కూరగాయల మార్కెట్లనే ఎంచుకుంటాయి’’ అని అగర్వాల్ చెప్పారు. కూరగాయలు తినడానికి వచ్చే ఆవులను దొంగలు ఎత్తుకెళ్తున్నారని ఆయన చెప్పారు. ‘‘పాతబస్తీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కూరగాయల మార్కెట్ వద్ద ఆవులను పట్టుకెళ్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది’’ అని ఆయన వెల్లడించారు. కూరగాయల మార్కెట్ల వద్ద గట్టి నిఘా పెడితే ఆవులను దొంగలించే ముఠాను అరికట్టవచ్చని ఆయన చెప్పారు.

గోవధ శాల వద్ద నిఘా

‘‘తెలంగాణలో ఉన్న గోవధ శాలల వద్ద కూడా ఓ కన్నేసి ఉంచితే ముఠాలను అరికట్టవచ్చు’’ అని అగర్వాల్ చెప్పారు. గోరక్ష సంరక్షకులు దొంగిలించే ముఠా సభ్యులను పట్టుకుంటున్నప్పటికీ సులభంగా తప్పించుకోగలుగుతున్నారు అని ఆయన అన్నారు. ‘‘ఎందుకంటే వ్యవసాయం కోసం ఎద్దులను తీసుకెళ్లొచ్చు ఆవులను అయితే పెంచుకోవడానికి’’ అని ముఠాలు పోలీసులకు చెబుతున్నాయని ఆయన చెప్పారు. ‘‘గోవధ నిషేధ చట్టాన్ని అమలు పరచాల్సింది పాలకులు అయితే సిఆర్ పిసి చట్టం ప్రకారం ఆ బాధ్యత పౌరులపైనే ఉంది’’అని అగర్వాల్ పేర్కొన్నారు.

సిర్ పిసి 43 ప్రకారం సిర్ పిసి 43 ప్రకారం ఎప్పుడైనా కాగ్నిజబుల్ (Cognizable) నేరం జరిగినప్పుడు, ఎవ్వరైనా ప్రైవేట్ పర్సన్ అంటే నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది, గో వధ అనేది కూడా కాగ్నిజబుల్ (Cognizable) నేరం కింద వస్తుంది. కనుక గో వధ కోసం ఆవులను, ఎద్దులను రవాణా చేస్తే అడ్డుకొని అరెస్ట్ చేసే హక్కు ప్రతీ పౌరుడికి వుంది. ఏ వ్యక్తి అయినా దీన్ని ఆపొచ్చు తర్వాత వాటిని పోలీస్ వాళ్లకు అప్పగించాలి.

Tags:    

Similar News