అదుపు తప్పిన లారీ భీభత్సం
యాదాద్రి జిల్లా భువనగిరిలో ఇద్దరు మృతి;
By : The Federal
Update: 2025-08-03 12:27 GMT
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జగదేవ్‌పూర్ చౌరస్తాలో అదుపు తప్పిన లారీ బీభత్సం సృష్టించింది. దుకాణాల మీదకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. కిందపడిన వారిలో పలువురికి గాయాలు అయ్యాయి. ఓ మృతుడిని రాజపేట మండలం కురారం గ్రామానికి చెందిన రామకృష్ణగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ అయిందా? డ్రైవర్ తప్పిదమా? తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పోలీసులు వెల్లడించారు.