ఐటి ఉద్యోగి బర్త్ డే వేడుకలో డ్రగ్స్

చేవెళ్ల ఫాంహౌస్ లో రెండు లక్షల విలువైన డ్రగ్స్ తో బాటు విదేశీ మద్యం స్వాధీనం;

Update: 2025-08-03 13:12 GMT

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్‌ కలకలం రేగింది. ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్టు నార్కోటిక్ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. సెరీన్‌ ఆచార్జ్‌ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు బర్త్‌డే వేడుల్లో మునిగిపోయారు. ఫామ్‌హౌస్‌లో పోలీసులు జరిపిన సోదాలలో రూ.రెండు లక్షల విలువైన డ్రగ్స్‌తో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు. ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్‌ రావడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. తన బర్త్‌డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్‌ బెనర్జీ ఈ ఫామ్‌హౌస్‌ను బుక్ చేశారు. ఫామ్‌హౌస్‌ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి పై ఉక్కుపాదం మోపుతోంది. అయినప్పటికీ వాటి వాడకం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. చాటు మాటుగా డ్రగ్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్‌తో పట్టుబడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ దందా యదేచ్చగా సాగుతోంది. తాజాగా.. చేవెళ్ల ఘటనలో డ్రగ్స్ వాడకం ఎంత లోతుగా పాతుకుపోయిందో మరోసారి స్పష్టం చేసింది. పోలీసులు డ్రగ్స్‌తో పాటు అత్యంత విలువైన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News