కవితకు బిగ్ షాక్

దీక్షకు హైకోర్టు నిరాకరణ;

Update: 2025-08-04 13:29 GMT

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈ నిరాహార దీక్షకు కోర్టు అనుమతి ఇవ్వలేదని కవిత చెప్పారు. తాను చేపట్టిన ఈ దీక్షను విరమించిన్నట్లు ఆమె తెలిపారు. కోర్టులను ధిక్కరించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కోర్టుల పట్ల తనకు అపార గౌరవం ఉందన్నారు.


రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పులను తెలంగాణ జాగృతి ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతుందని కవిత అన్నారు. బీసీల తరఫున పోరాటం ఆపమని చెప్పారు. ‘‘మేము ఒక్క అడుగు వెనక్కి వేస్తే.. 10 అడుగులు ముందుకు వేస్తామని’’ కవిత చెప్పారు. కోర్టు తీర్పును శిరసావహిస్తామని, ఈ దీక్షను ఇంతటితో ముగిస్తున్నామని కవిత స్పష్టం చేశారు.కోర్టు జోక్యంతో తాను చేసే దీక్ష మాత్రమే ఆగిందని, పోరాటం ఆగదని.. భిన్నరూపాల్లో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ధర్నాలతో సాధించేది ఏం లేదు ’’అని చేసిన ప్రకటనను ఆమె తప్పు పట్టారు. మీరు రాష్ట్రపతి వద్దకు వెళ్లవచ్చు అని తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు కవిత సూచించారు.
Tags:    

Similar News