బెట్టింగ్ లకు బానిసై దొంగతనాలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోమహిళల మెడల నుంచి గొలుసులు దొంగతనం;
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway Station)లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న లవరాజు అనే వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7,70,000 విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావెద్ మీడియాకు వివరించారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా శంఖవరం మండలం జగ్గంపేటకు చెందిన కోరుప్రోలు లవరాజు (23) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పరిధి సూరారంలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. తాను చేసే బెట్టింగ్ లకు అప్పులపాలయ్యాడు. దొంగతనాలు చేయడమే పరిష్కారం అనుకున్నాడు. రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంచుకున్నాడు. మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు దొంగిలించేవాడు’’ అని డిఎస్పీ చెప్పారు. కొంతకాలంగా మద్యం, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అయ్యాడని పోలీసులు చెప్పారు. తద్వారా వచ్చిన డబ్బును బెట్టింగ్‌లలో పెట్టేవాడు.
ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న సింహపురి ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 2న గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో బంగారు గొలుసులు దొంగతనం చేశాడు. బాధితుల ఫిర్యాదులతో రంగంలో దిగిన రైల్వే పోలీసులు వేగవంతం చేశారు. సోమవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ‘‘తాను చేసిన నేరాన్ని లవరాజు అంగీకరించాడు’’ అని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.హైదరాబాద్ లో కొంతకాలంగా చైన్ స్నాచర్ లు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. పట్టపగలే ముఖానికి మాస్కులు ధరించి నడుచుకుంటూ వెళుతున్న మహిళ ల మెడలోంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లేవారు.కాని లవరాజు మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మాత్రమే తాను చేసే దొంగతనాలకు కరెక్ట్ ప్లేస్ అనుకుని మహిళల మెడలో నుంచి గొలుసులు దొంగిలించినట్టు పోలీసులు చెప్పారు.