పదోతరగతి విద్యార్థుల ఆన్సర్ షీట్లకు డ్యామేజ్..

కనీస జాగ్రత్తలు పాటించకుండా తరలిస్తున్న క్రమంలో అవి నలిగిపోయి బాగా డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.;

Update: 2025-03-29 12:09 GMT

పదోతరగతి ఫైనల్ పరీక్షల ఫలితాలు ప్రతి విద్యార్థికి చాలా కీలకం. వీటిలో తమ ఫలితాలు ఎలా ఉంటాయా అని ఎదురుచూస్తుంటారు విద్యార్థులు, వారి తల్లదండ్రులు. ఈ పరీక్షల్లో ఆశించిన మార్కకులు రాలేదని విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలు ఎన్నో. అలాంటి ఆ పరీక్షల ఆన్సర్ షీట్స్‌లు అధికారులు చాలా పదిలంగా చూసుకుంటారు. కానీ ఖమ్మం జిల్లాలోని కారేపల్లిలో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పదో తరగతి పరీక్షల్లో సైన్స్ పరీక్షకు చెందిన ఆన్సర్ షీట్స్ డ్యామేజ్ అయ్యాయి. పరీక్ష పేపర్ల విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకుండా తరలిస్తున్న క్రమంలో అవి నలిగిపోయి బాగా డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ పేపర్లలో తమ భవిష్యత్తు ఉందని, అలాంటి వాటిని ఇంత నిర్లక్ష్యంగా ఎలా తరలిస్తారని, కనీస భద్రత లేకుండా చిత్తుకాగితాలు మూటగట్టినట్లు కట్టి తీసుకెళ్లడం ఏంటని విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే టెన్త్ పరీక్ష జవాబు పత్రాలను సరైన పద్దతిలో ప్యాక్ చేయకుండా తరలిస్తుండటంపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పరీక్ష పేపర్లను పోలీసుల బందోబస్తు మధ్య పరీక్ష కేంద్రాలకు చేర్చి, విద్యార్థుల చేత పరీక్షలు రాయిస్తారో.. ఆన్సర్ పేపర్లను కూడా అదే బందోబస్తు మధ్య తీసుకెల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా ఇక్క ఆన్సర్ పేపర్లను ఇంతటి నిర్లక్ష్యంగా తరలిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News