తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన ఇన్‌ఛార్జ్
ఆమె రాహుల్ గాంధీ బృందంలో కీలకంగా వ్యవహరించారు.;
దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కూడా మారారు. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ఆమె రాహుల్ గాంధీ బృందంలో కీలకంగా వ్యవహరించారు. ఆమె నియామకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దీపాదాస్ మున్షీకి దన్యవాదాలు తెలిపారు. ఆమె ఏడాది కాలంగా పార్టీ కోసం ఎంతో శ్రమించారని అన్నారు.
‘‘తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇన్చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్‌కి స్వాగతం. మీనాక్షి నటరాజన్.. తెలంగాణలో ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ఆమె అనేకసార్లు తెలంగాణలో పర్యటించారు. మీనాక్షి నటరాజన్ గారు ఇన్చార్జి తెలంగాణ కాంగ్రెస్ మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నా. మీనాక్షి నటరాజన్ nsui జాతీయ అధ్యక్షురాలిగా పని చేసిన సమయంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, ఆంద్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర nsui అధ్యక్షులు గా సుదీర్ఘ కాలం ఆమెతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్‌లు వీరే
హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్‌కు రజనీ పాటిల్
హర్యానాకు బీకే హరిప్రసాద్
మధ్యప్రదేశ్‌కు హరీశ్ చౌదరి
తమిళనాడు, పుదుచ్చేరికి గిరీశ్ చౌడాంకర్
ఒడిశాకు అజయ్ కుమార్ లల్లూ
ఝార్ఖండ్‌కు కే రాజు
మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌కు సప్తగిరి శంకర్ ఉల్కా
బీహార్‌కు కృష్ణ అల్లవారులను నియమిస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది.