సెలబ్రిటీలతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందా ?
ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలపై సినిమా, బుల్లితెరకు చెందిన 29 మంది సెలబ్రిటీలపై ఈడీ(ED) కేసులు నమోదుచేసింది;
చాలామంది సెలబ్రిటీలు మహా ముదుర్లు. అందుకనే వాళ్ళతో డీలింగులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇపుడు విషయం ఏమిటంటే బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలపై సినిమా, బుల్లితెరకు చెందిన 29 మంది సెలబ్రిటీలపై ఈడీ(ED) కేసులు నమోదుచేసింది. వారిని విచారణకు రమ్మని నోటీసులు జారీచేస్తోంది. అయితే తాము సినిమా షూటింగులో బిజీగా ఉన్న కారణంగా విచారణకు రాలేమని సమాధానాలు వస్తున్నాయి. దగ్గుబాటిరానా(Rana) బుధవారం విచారణకు రావాల్సుండగా రాలేదు. తానుషూటింగుల బిజీలో ఉన్నాను కాబట్టి విచారణకు రావటం కుదరదని సమాధానమిచ్చారు. అందుకనే ఆగష్టు 11వ తేదీన విచారణకు హాజరవ్వాలని ఈడీ ఈరోజుమరోసారి నోటీసు జారీచేసింది.
రానానే కాకుండా మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు చాలామంది నోటీసులను అందుకున్నారు. అలాగే మంచులక్ష్మి(Manchu Lakshmi) కూడా రానా చెప్పిన సమాధానాన్నే చెప్పారట. తాను షూటింగు బిజీలో ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేనని చెప్పినట్లు సమాచారం. ఈనెల 30వ తేదీన ప్రకాష్ రాజ్ విచారణకు హాజరుకావాల్సుంది. ఆగష్టు 6వ తేదీన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) విచారణకు హాజరవ్వాలి. విచారణకు హాజరవ్వాల్సిన రానా, మంచులక్ష్మి షూటింగుల బిజీ కారణంగా రాలేమని చెప్పారు కాని ఏరోజున విచారణకు హాజరవుతాము అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. అంటే ఈడీ చెప్పిన రోజున విచారణకు రారు, అలాగని తాము విచారణకు హాజరయ్యే తేదీని చెప్పటంలేదు. వచ్చేనెల 11వ తేదీన విచారణకు రావాలని రానాకు చెప్పిన ఈడీ మంచును రెండురోజుల తర్వాత అంటే ఆగష్టు 13వ తేదీన విచారణకు రమ్మని నోటీసు జారీచేసింది. ఈనెల 30వ తేదీన విచారణకు హాజరవ్వాల్సిన ప్రకాష్ రాజ్(Prakssh raj) ఏమిచేస్తారో చూడాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సినీ సెలబ్రిటీలంటే 365 రోజులూ షూటింగులతోనే బిజీగా ఉంటారని అందరికీ తెలిసిందే. సినిమాలు, వెబ్ సీరీసులు, అడ్వర్టైజ్మెంట్లు, టీవీ షోలు ఇలా ఏదో ఒకరూపంలో ప్రతిరోజు బిజీగానే ఉంటారు. కాబట్టి వీళ్ళని విచారించాలంటే ఈడీకి ఏడాదిలో ఒక్కరోజు కూడా సాధ్యంకాదు. ఎందుకంటే పలానా రోజున తాము ఖాళీగా ఉన్నామని సెలబ్రిటీలు ఎవరూ చెప్పరు. అలాంటపుడు వీళ్ళని విచారించటం ఈడీకి ఎలాగ సాధ్యమవుతుంది ? విచారణకు హాజరుకాకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఈడీ అంటే భయముంటేనే నోటీసులో చెప్పిన తేదీకి సెలబ్రిటీలు విచారణకు హాజరవుతారు. లేకపోతే వీళ్ళని విచారించటం ఏ దర్యాప్తుసంస్ధవల్లా కాదు.