తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు..

పూర్తి వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Update: 2025-10-01 16:16 GMT

తెలంగాణకు తాజాగా మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయని, ఇప్పుడు కేటాయించిన నాలుగిటితో కలిపి వీటి సంఖ్య 39కి చేరుతుందని ఆయన తెలిపారు. ఈ నాలుగు కేంద్రీయ విద్యాలయాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం(గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లా-జగిత్యాల రూరల్ మండలం చెల్గల, వనపర్తి జిల్లా-నాగవరం శివారులో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.

నాణ్యమైన విద్యే లక్ష్యం..

ఈ నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కూడా నాణ్యమైన ప్రాథమిక, సెంకడరీ విద్య అందించడం కోసం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి ఈ విద్యాలయాలు సంపూర్ణ సహకారం అందిస్తాయన్నారు. వీటికి కేటాయించినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

రెండేళ్లలో రూ.400 కోట్లు

కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యకు పెద్దపీట వేస్తోందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందుకే గత రెండేళ్లలో తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేసి 832 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పీఎం-శ్రీ స్కూల్స్ కోసం భారీగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. సమగ్రశిక్షా అభియాన్ కింద రెండేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.2వేల కోట్లు అందించినందని అన్నారు. దాంతో పాటుగా రూ.వెయ్య కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనిర్వసిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేస్తోందని చెప్పారు.

Tags:    

Similar News