ఛార్జీలు పెంచిన హైదరాబాద్ మెట్రో
కనీస ఛార్జీ 10 రూపాయల నుండి 12 రూపాయలకు, గరిష్ట ఛార్జీ రు. 60 నుండి 75 రూపాయలుగా పెంచినట్లు యాజమాన్యం చెప్పింది;
By : The Federal
Update: 2025-05-15 12:17 GMT
ఎప్పటినుండో అనుకుంటున్నట్లుగానే హైదరాబాద్ మెట్రోలో ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఈనెల 17వ తేదీనుండి అమల్లోకి వస్తాయని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. కనీస ఛార్జీ 10 రూపాయల నుండి 12 రూపాయలకు, గరిష్ట ఛార్జీ రు. 60 నుండి 75 రూపాయలుగా పెంచినట్లు యాజమాన్యం చెప్పింది. పెరిగిన ఛార్జీల ప్రకారం మొదటిరెండు స్టాపులకు రు. 12 ఉంటుంది.
పెరిగిన ఛార్జీలు ఈ కిందివిధంగా ఉన్నాయిః
రెండు నుండి 4 స్టాపుల వరకు రు. 18 రూపాయలు.
4 నుండి 6 స్టాపులవరకు రు. 30
6 నుండి 9 స్టాపుల వరకు రు. 40
9 నుండి 12 స్టాపుల వరకు రు. 50
12 నుండి 15 స్టాపుల వరకు రు. 55
15 నుండి 18 స్టాపుల వరకు రు. 60
18 నుండి 21 స్టాపుల వరకు రు. 66
21 నుండి 24 స్టాపుల వరకు రు. 70
24 స్టాపుల..ఆపై వరకు రు. 75 ఛార్జీ ఉంటుంది.