ప్రకాష్‌కి పతంజలి లిటరరీ అవార్డు
అవార్డుకే పేరొచ్చేటట్లు ఇచ్చారు. రాతల మాంత్రికుడు ప్రకాష్‌కి ఈ అవార్డు రావడం గ్రేట్.;
ప్రముఖ పాత్రికేయుడు, రచయిత స్వర్గీయ కె.ఎన్.వై. పతంజలి 73 వ జయంతి సందర్భంగా మార్చి 29న పతంజలి పురస్కారాలు అందజేయనున్నారు. ప్రముఖ పాత్రికేయుడు రచయిత తాడి ప్రకాష్‌కి ఈ పురస్కారం అంద చేయనున్నట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ప్రకటించారు. శుక్రవారం గురజాడ అప్పారావు గృహంలో వేదిక ప్రతినిధులతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పతంజలి జయంతి సందర్భంగా ప్రముఖులకు పురస్కారం అందచేస్తున్నామని కార్టూనిస్ట్ మోహన్, దేవిప్రియ,శరత్ చంద్ర, చింతికింద శ్రీనివాసరావు, జి.ఆర్.మహర్షి, పప్పు అరుణ,అట్టాడ అప్పలనాయుడు,గంటేడ గౌరునాయుడు,సువర్ణముఖి,లాంటి ప్రముఖులకు పురస్కారం లభించిందని,పురస్కార కమిటీ సభ్యులు వి.ఎమ్.కె.లక్ష్మణరావు,బండ్లమూడి నాగేంద్ర ప్రసాద్,ఎన్. కె.బాబు తో కూడిన బృందం 2025 సంవత్సరం కి గాను ప్రకాష్ పేరుని ప్రతిపాదించిందని భీశెట్టి తెలిపారు,మార్చి 29 శనివారం సాయంత్రం విజయనగరం గురజాడ గ్రంధాలయంలో పురస్కార ప్రదానం జరుగుతుందని అన్నారు,సాహిత్య అభిమానులు, రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని భీశెట్టి కోరారు.