KTR | ‘అందరి లెక్కలు సెటిల్ చేస్తా’

కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లను మూడుచెరువుల నీళ్ళు తాగించి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు;

Update: 2025-08-07 13:13 GMT
BRS working president KTR

అధికారంలోకి రాగానే అందరిలెక్కలు సెటిల్ చేసే బాధ్యత తానే తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లను మూడుచెరువుల నీళ్ళు తాగించి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్(KCR) ముఖ్యమంత్రి అవటం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. పార్టీ అధికారంలోకి రాగానే అతిచేస్తున్న పోలీసుల పనిచెబుతానని తీవ్రస్వరంతో హెచ్చరించారు. కొందరు పోలీసు అధికారులు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)మాటలకు మించి అతిచేస్తున్నట్లు మండిపడ్డారు. ఇలాంటి వాళ్ళవివరాలను జాగ్రత్తగా డైరీలో నోట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అన్నీ రాసిపెట్టుకుంటున్నానని, అధికారంలోకి రాగానే అందరి లెక్కలు సెటిల్ చేస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ముఖ్యమంత్రిగా ఎలాగుండాలో కేసీఆర్ చూపిస్తే ఎలాగుండకూడదో రేవంత్ చూపిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. పనిలోపనిగా బీఆర్ఎస్-బీజేపీ విలీనం అనేముచ్చటే ఉండదన్నారు. తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుందని ప్రకటించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని ఎవరెవరో ఏదిపడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీకి రాజీనామాచేసిన మాజీ ఎంఎల్ఏ గువ్వల బాలరాజు విలీనం ప్రస్తావన తీసుకొచ్చారు. అంతకముందు కల్వకుంట్ల కవిత కూడా ఇవే ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనంచేసే ప్రయత్నాలు జరిగినట్లు ఆమె చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేటీఆర్ మాత్రం కవిత, గువ్వల పేరును ఎత్తకుండానే గట్టిగా బదులిచ్చారు.

రాబోయే ఎన్నికల్లో కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని ఓడించటం ఖాయమన్నారు. కాంగ్రెస్ కు అన్నీవర్గాల ప్రజల్లో ముఖ్యంగా రైతాంగంలో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోందన్నారు. ఇక ఫిరాయింపు ఎంఎల్ఏల గురించి మాట్లాడుతు వాళ్ళ పరిస్ధితి విచిత్రంగా తయారైందన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలు అతితెలివితో మాట్లాడుతున్నట్లు ఎద్దేవా చేశారు. వాళ్ళందరు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేకపోతున్నారని అన్నారు.

Tags:    

Similar News