‘జనహిత’ పాదయాత్రకు విశేష జనాదరణ

మినాక్షి నటరాజన్‌కు స్వాగతం పలికిన ప్రజలు.;

Update: 2025-08-01 05:47 GMT

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ ప్రారంభించిన ‘జనహిత’ పాదయాత్రకు విశేష జనాదరణ లభించింది. ఈ పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు వికారాబాద్ జిల్లా నుంచి ప్రారంభించింది. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ సాధనకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో కేంద్రంతో పోరాడతామని, ఎంతదూరం వెళ్లయినా బీసీలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, తమకు ప్రజల బలం చేకూరితే ఏదైనా సాధిస్తామన్న నమ్మకం ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లని, వారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు. ‘‘రాహుల్ గాంధీ 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలోని ప్రతి ఒక్కరి మనసు తెలుసుకున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీని అనుసరించడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది” అని తెలిపారు.

‘‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచితబస్సు, రైతులకు రైతు భరోసా అందిస్తున్ానం. అన్ని వర్గాల పిల్లలు ఒకే పాఠశాలల చదువకుకోవడానికి, వారికి నాణ్యమైన విద్యను అందించడం కోసం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం. పూలే, మహాత్మాగాంధీ, అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నది’’ అని తెలిపారామే.

Tags:    

Similar News