సూర్యపేటలో మంత్రి హెలికాప్టర్ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మార్వో..

మంత్రి వస్తుండటంతో రైతులతో మాట్లాడాం. అందుకు వారు అంగీకరించారు. అంతేకానీ హెలీప్యాడ్ కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఎమ్మార్వో తెలిపారు.;

Update: 2025-03-29 11:04 GMT

‘మంత్రి పర్యటన సూర్యాపేట జిల్లాలో తీవ్ర వివాదానికి దారితీసింది. మంత్రి పర్యటించడం కన్నా.. ఆయన హెలికాప్టర్‌లో రావడం ఈ వివాదానికి మూలకారణం అంటున్నారు మరికొందరు. కానీ రైతులు, స్థానికులు మాత్రం మంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి అధికారులు ప్రదర్శించిన అతిశయోక్తి కారణంగానే ఈ వివాదం జరిగిందంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా.. అధికారులకు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం. వరి పంటను కోతలు కోసి.. వరి ధాన్యాన్ని ఆరబోసారు రైతులు. కాగా ఇప్పుడు మంత్రి హెలికాప్టర్‌లో పర్యటనకు వస్తున్నారని, హెలికాప్యాడ్ కోసం ఆరబోసిన ధాన్యం అంతా తీసేయాలని అధికారులు హుకుం జారీ చేశారని, ఈ విషయంలోనే వాగ్వాదం చోటు చేసుకుందని రైతులు చెప్తున్నారు’’ అన్న వార్తలు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వినిపించాయి. మంత్రిని ప్రసన్నం చేసుకోవడం కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని కొందరు నెటిజన్లు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ వార్తలు క్షణక్షణానికి ఎక్కువవుతుండటంతో వీటిపై నేరేడుచర్ల ఎమ్మార్వో సైదులు స్పందించారు. ‘‘గతంలో రెండు మూడు సార్లు నేరుడుచర్లలో హెలిప్యాడ్ ఇక్కడే ఏర్పాటు చేశాం. ఇవాళ మంత్రి వస్తుండటంతో రైతులతో మాట్లాడాం. అందుకు వారు అంగీకరించారు. అంతేకానీ హెలీప్యాడ్ కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. కానీ కొందరు మాత్రం రైతులను ఇబ్బంది పెడుతున్నామని, బలవంతంగా ధాన్యం తీయించేస్తున్నామంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతులతో మాట్లాడి వాళ్లు ఒప్పుకున్న తర్వాతనే ధాన్యం తీయాలని చెప్పాం’’ అని ఆయన చెప్పారు.

Tags:    

Similar News