కొండాపూర్ రేవ్ పార్టీలో అశ్లీల నృత్యాలు

జల్సారాయుళ్లతో మందు చిందు;

Update: 2025-07-27 09:08 GMT

కొండాపూర్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. సర్వీస్ అపార్టెమెంట్లలో రేవ్ పార్టీలు నిర్వహించే ముఠాలోని తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి డ్రగ్స్ , మద్యంబాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 11మందిపై కేసు నమోదు చేశారు. వీళ్లు వీకెండ్స్ లో పార్టీలను నిర్వహించేవారు. జల్సా రాయుళ్లు వీళ్లను కాంటాక్ట్ చేస్తే చాలు లొకేషన్ షేర్ చేసి జల్సారాయుళ్లను రేవ్ పార్టీలు నిర్వహించే సర్వీస్ అపార్ట్ మెంట్లకు రప్పించుకునేవారు. ఎపికి చెందిన శివం రాయుడు, నాయుడు ఎలియాస్ వాసు మరికొందరితో ముఠాగా ఏర్పడి రేవ్ పార్టీలు నిర్వహించేవారు. శనివారం రాత్రి కొండాపూర్ లోని ఓ సర్వీస్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ ఉన్నట్లు పోలీసులకు సమాచారమందింది. పోలీసులు దాడులు చేస్తే రేవ్ పార్టీలో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు అసభ్యకరరీతిలో కనిపించారు. జల్సారాయుళ్లతో బాటు రేవ్ పార్టీ నిర్వాహకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అశ్లీల నృత్యాలు చేసేవారు వ్యభిచారం కూడా చేసేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రేవ్ పార్టీలో నిషేధిత డ్రగ్స్ దొరికింది. మద్యంబాటిళ్లు, నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News