‘రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ బీఆర్ఎస్ రావాలి’

కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్ల సమాజం ఎంతో నష్టపోయిందన్న కేటీఆర్.;

Update: 2025-09-16 12:30 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు, రేవంత్‌కు పాలన చేతకాదన్నారు. వాళ్ల అసమర్థ పాలన, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. కాంగ్రెస్ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగానే జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్రను తిరిగి ప్రారంభించాలని పిలుపునిచ్చారు. గత 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు.

బీఆర్‌ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను తెలంగాణ ఆర్థిక ఇంజిన్‌గా మార్చిన గత పదేళ్ల తమ ప్రభుత్వ పాలనకు భిన్నంగా, కాంగ్రెస్ పార్టీ విధానాలు నగరాన్ని పూర్తిగా కుప్పకూల్చేలా ఉన్నాయని, ఈ విషయాన్ని నగర ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే భారత రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్ల నష్టపోయాయని ఆయన అన్నారు.

ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశానికి కేటీఆర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్‌తో చర్చించారు. ఈ ఉప ఎన్నికలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి, జూబ్లీహిల్స్ నుంచి భారత రాష్ట్ర సమితి విజయయాత్రను తిరిగి ప్రారంభించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News