విద్యుత్ శాఖ అధికారి ఇళ్లలో ఏసీబీ సోదాలు

బినామీల పేరిట ఆస్తులు కూడగట్టినట్టు గుర్తించిన అధికారులు;

Update: 2025-09-16 12:11 GMT

ఇటీవలె విద్యుత్ శాఖ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విద్యుత్ శాఖ అధికారుల ఇళ్లపై దాడులు ప్రారంభించారు. హైదరాబాద్ మణికొండలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ నివాసం, కార్యాలయం, ఆయన బంధువుల నివాసాలలో సోదాలు చేపట్టారు.

మణికొండ, నార్సింగ్ డివిజన్లలో ఏడీఈగా అంబేద్కర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. అక్రమాస్తులకు సంబంధించిన అనేక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. బినామీల పేరిట భారీగా వ్యవసాయ భూములు, స్థలాలతోపాటు భవనాలను అంబేద్కర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రెండు కోట్ల రూపాయల నగదును ఎసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.విద్యుత్ కనెక్షన్ కు వచ్చిన వ్యక్తుల నుండి అంబేద్కర్ భారీ ముడుపులు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 15 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News