మనసు తెలంగాణకు, తనువు మెడికల్ కాలేజీకి
బిసి నాయకుడు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ జీవితమంతా సామాజిక న్యాయంకోసమే..;
ప్రభంజన్ యాదవ్ జీవిత యాత్ర క్లుప్తంగా...
యాదనాల ప్రభంజన్ యాదవ్ జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఒక సామాన్య గొర్రెల కాపరి యాదవ కుటుంబంలో యాదనాల కొమరమ్మ సోమయ్య దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. మొట్టమొదటి సారిగా గ్రామం నుండి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (IIS) సాధించాడు. హాయిగా ఉండే కేంద్ర సర్వీస్ ఆయనకు నచ్చలేదు. ఉద్యమం పిలుస్తోందని ఉద్యోగానికి రాజీనామా ఢిల్లీ నుంచి తెలంగాణలో వాలిపోయాడు. నిజామాబాద్ తెలంగాణ యూనివర్శిటీలో జర్నలిజం శాఖ చేరాడు.
ఐఐఎస్ అధికారిగా ఆకాశ వాణి ( All India Radio)లో విధులు నిర్వహించి , జాతీయ ప్లానింగ్ కమిషన్ న్యూఢిల్లీ లో నందు పి ఆర్ ఓ గా పనిచేశారు.
అదీనచ్చలేదు. అవి తెలంగాణ ఉద్యమం సాగుతున్న రోజులు. ఉద్యమాలు ఆయన్ని ఉద్యోగాన ఉంచలేదు.
తెలంగాణ కోసం రాజీనామా చేశాడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చరుకుగా పాల్గొన్నాడు.
తొలి నుంచి ఇదే తంతు.
విద్యార్థి దశ నుండే, వామపక్ష ఉద్యమాల కీలకపాత్ర పోషిస్తూ డోలు దెబ్బ ,యాదవ ఇంటలెక్షువల్ ఫోరంల స్థాపనలో చురుకుగా పాల్గొన్నాడు.
దొడ్డి కొమురయ్య చిత్రాన్ని మొట్టమొదటగా చేయించిన వ్యక్తి ప్రభంజనే.
ప్రభంజన్ కాలు నిలకడగా ఉండదు. విపరీతంగా తిరుగుతాడు. ఎంత చిన్నసమావేశానికైన వస్తాడు. తన సాంఘిక న్యాయ ఫిలాసఫీ గట్టిగా డిఫెండ్ చేసుకుంటాడు. బిసిలకు అధికారం రావాలనేది ఆయన బలమయిన వాంఛ. ఎవరేమనుకున్నా సరే, తనునమ్మిన దారిన తాను పోతాడు. ఈ విషయంలో రాజీ లేదు.
సత్యశోధక సామాజిక విద్యాపీఠం స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించిన వ్యక్తి ప్రభంజన్.
గద్దర్ నడిపించిన జననాట్యమండలిపై తన ఎం ఫీల్ ధీసిస్ ప్రజెంట్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిఎస్పి పార్టీ జనరల్ సెక్రటరీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక ఉద్యమ సంఘాలు ఆ తర్వాత తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో ప్రొఫెసర్ గా తన సేవలను కొనసాగారు. అక్కడే రిటైర్డ్ అయినారు.
ఆ తర్వాత సామాజిక ఉద్యమకారుడిగా ‘తెలంగాణ జన సేన’ స్థాపించి , సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా అహర్నిశలు పరితపిస్తూ ఊరూరు తిరిగారు.
మండల్ టీవీ సోషల్ మీడియా ఛానల్ ద్వారా ఉద్యమాలను ప్రచారం చేశారు.
ఈ సామాజిక న్యాయయాత్ర కొనసాగిస్తూన్నపుడే కాన్సర్ బారినపడ్డారు.
ఆపరేషన్ జరిగాక విశ్రాంతితీసుకోకుండా మళ్లీ చరుకుగా కార్యకలాపాలు సాగిస్తూ వచ్చానరు.
ఈ జబ్బుతోనే తుది శ్వాస విడించారు.
ఆయన నినాదం ‘మేం ఎంతో మాకు అంత’. దీని వల్లిస్తూ BC ఉద్యమాన్ని నడిపిస్తూ అనేక సభలు సమావేశాలు నిర్వహించి బహుజన మీడియా , ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ , మొదలగు పుస్తకాలను రచించారు.
చివరగా తన భౌతిక దేహాన్ని కూడా జనగాం మెడికల్ కాలేజ్ కి సమర్పించారు..