పార్టీ మార్పుపై సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ

మాజీ మంత్రి, మహేశ్వర బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Update: 2024-07-01 09:14 GMT

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. మరో 10 నుండి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఫిరాయింపులను కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేలకు హితబోధలు చేశారు. వచ్చేది మన ప్రభుత్వమే, మీ అందరికి అండగా ఉంటాను, ప్రలోభాలకు లొంగకండి అంటూ భరోసా కల్పించారు.

ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి, మహేశ్వర బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వివిధ మాధ్యమాలలో న్యూస్ వైరల్ అయ్యాయి. దీంతో ఈ ప్రచారానికి చెక్ పెట్టేందుకు సబితా ఇంద్రారెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఒక పోస్ట్ పెట్టారు.

"నేను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకి విజ్ఞప్తి. బీఆర్ఎస్ పార్టీలో నాకు గౌరవ కేసీఆర్ సముచితమైన స్థానం కల్పించారు, పార్టీ మరాల్సిన అవసరం కాని అలోచన కాని ఏమాత్రం లేదు. బీఆర్ఎస్ పార్టీలోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా" అంటూ సబితా ఇంద్రారెడ్డి తేల్చి చెప్పారు. దీంతో ఆమె పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది.

Tags:    

Similar News