‘ఆర్టీసీ ఆదాయం పెరిగింది’

‘మహాలక్ష్మీ’ పథకంతో తెలంగాణ ఆర్టీసీ రూ.6వేల కోట్లు ఆర్జించిందన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.;

Update: 2025-07-23 09:37 GMT

తెలంగాణలో మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహాలక్ష్మీ’ పథకం తీసుకొచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీకి ఎంతో మేలు జరిగిందని ఆయన పేర్కొన్నారు. అప్పటి వరకు 67శాతంగా ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ.. ఈ పథకం అమలైన తర్వాత నుంచి 97శాతానికి చేరుకుందని, తద్వారా ఆర్టీసీ లాభాల బాట పట్టిందని ఆయన వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని, ఇది ఒక సుభపరిణామమని ఆయన చెప్పారు. ఉచిత ప్రయాణాలు 200 కోట్ల మైలురాయిని అందుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌లో నిర్వహించిన వేడుకల్లో భట్టి విక్రమార్క పేర్కొని.. కీలక వివరాలు వెల్లడించారు.

లాభాల్లోకి ఆర్టీసీ..

‘మహాలక్ష్మీ’ పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద జరిగిన ప్రయాణాల వల్ల ఆర్టీసీ రూ.6వేల కోట్లు ఆర్జించిందని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వేల సంఖ్యలో కొత్త బస్సులను కొనుగోలు చేసిందని, కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఖర్చుకు వెనకాడకుండా ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన అన్నారు.

Tags:    

Similar News