గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్స్ వచ్చేశాయ్..

TGPSC Group-1 General Ranking Lisk Came Out;

Update: 2025-03-30 05:06 GMT

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ జాబితాను అధికారులు ఆదివారం విడుదల చేశారు. c గతేడాది అక్టోబర్‌లో గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ.. ఈ ఏడాది మార్చి 10న ప్రొవిజినల్‌ మార్కులు విడుదల చేసింది. తాజాగా జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ ర్యాంక్‌ను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదెలా ఉంటే గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 పరీక్ష పేపర్ల మూల్యాంకనం అత్యంత లోపభూయిష్టంగా జరిగిందని వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే గ్రూప్-1 పరీక్ష పత్రాలను రీవాల్యుయేట్ చేయించాలని కోరుతూ వారు మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను దిద్దించారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లు మూల్యాంకనం చేయించారు. అలా చేయడం వల్ల మూల్యాంకనంలో నాణ్యత లోపించింది. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది" అని పిటిషనర్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News