అపాయిట్మెంట్ లెటర్లిచ్చి పోస్టుంగులు మరిచిన రేవంత్ ప్రభుత్వం

వైద్య, ఆరోగ్య శాఖకు అలాట్ అయిన అధికారులకు ఇప్పటివరకు పోస్టింగులు ఇవ్వటం మరచిపోయింది

Update: 2025-11-06 14:00 GMT
Group -1 officers with minister Damodar Raja Narsimha

ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సెటైర్లు పేలుతున్నాయి. కారణం ఏమిటంటే గ్రూప్-1 అధికారులుగా ఎంపికైన వారిలో కొందరిని వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించారు. అయితే వీరిలో ఎవరికీ ఇంతవరకు పోస్టింగ్ ఆర్డర్లు మాత్రం అందలేదు. దాంతో వాళ్ళంతా ఆందోళనతో గురువారం సెక్రటేరియట్ లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిశారు. అపాయిట్మెంట్ లెటర్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇంతవరకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవటంపై మంత్రితో చర్చించారు. తొందరలోనే అందరికీ వైద్యా, ఆరోగ్య శాఖ పోస్టింగ్ ఆర్డర్లు పంపుతుందని మంత్రి భరోసా ఇచ్చారు.

ఈ ఏడాది సెప్టెంబర్లో టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్-1 అధికారులుగా 562 మంది ఎంపికయ్యారు. వీరిలో కొందరిని వారికి వచ్చిన ర్యాంకుల ఆధారంగా టీజీపీఎస్సీ వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించింది. శిల్పకళావేదికలో సెప్టెంబర్లో ఏర్పాటుచేసిన పెద్ద కార్యక్రమంలో రేవంత్ అందరికీ నియామక పత్రాలను అందించారు. అంతే తర్వాత వైద్య, ఆరోగ్య శాఖకు అలాట్ అయిన అధికారులకు ఇప్పటివరకు పోస్టింగులు ఇవ్వటం మరచిపోయింది. అందుకనే అధికారులు ఈరోజు మంత్రి దామోదర రాజనర్సింహాను కలిసింది.

ఈ సందర్భంగా దామోదర్ వారితో మాట్లాడుతు శాఖలో పనిచేయటం అదృష్టంగా భావించాలన్నారు. అనారోగ్యంతో బాధలుపడే వారికి సేవచేయటం అవకాశం రావటం అరుదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యంత పేదలు వస్తుంటారని, వారికి ప్రేమతో సేవలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ వైద్య వ్యవస్ధపై జనాల్లో నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకోవాల్సింది అధికారులే అని వివరించారు. ఆసుపత్రుల పనితీరు, ఆరోగ్య రంగంలో ఉపయోగించుకోవాల్సిన సాంకేతికత, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాన్ని ప్రజలకు దగ్గర చేయాల్సిన బాధ్యతలను మంత్రి వివరించారు.

ఒకప్పటిలా ఇపుడు అంటువ్యాధుల భయంలేదని అయితే వాటిస్ధానంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ సమస్యలు పెరిగిపోయినట్లు మంత్రి చెప్పారు. ఇలాంటి సమస్యలపై కొత్తగా చేరబోతున్న అధికారులందరు అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతిజిల్లాలోను డేకేర్ సెంటర్లు, ఎన్సీడీ క్లినిక్కులను ప్రభుత్వం ఏర్పాటుచేసిందని రోగులకు మంచి వైద్యం అందించాలని సూచించారు.

Tags:    

Similar News