Gokulashtami Tragedy | గోకులాష్టమి వేడుకల్లో విషాదం..ఐదుగురు మృతి
గోకులాష్టమి వేడుకల ఊరేగింపులో విద్యుత్ ప్రమాదం;
గోకులాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా రథం ఊరేగింపులో ఐదుగురు మృతిచెందారు. ఇంతకీ ఏమి జరిగిందంటే హైదరాబాద్(Hyderabad) రామాంతపూర్ గోకలేనగర్లో శ్రీకృష్ణాష్టమి(Sri Krishnashtami) సందర్భంగా ఆదివారం వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి కృష్ణుడి విగ్రహంతో రథం ఊరేగింపు జరిగింది. ఊరేగింపు సందర్భంగా ఒకచోట రథానికి అనుసంధానించిన వాహనం మొరాయించింది. దాంతో వాహనాన్ని పక్కనపెట్టేసిన భక్తులు రథాన్ని చేతులతో లాగటం ప్రారంభించారు. ఈక్రమంలోనే రథానికి కరెంటు తీగలు తగలాయి. కరెంటు (Current shock)తీగలు రథనాకి తగలటంతోనే దాన్ని లాగుతున్న తొమ్మిదిమందికి షాక్ కొట్టడంతో వారంతా ఎగిరి దూరంగా పడిపోయారు.
వెంటనే తేరుకున్న మిగిలిన వాళ్ళు తొమ్మిదిమందిని దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో అప్పటికే ఐదుగురు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. మిగిలిన నలుగురి పరిస్ధితి కూడా ప్రమాదకరంగానే ఉన్నట్లు సమాచారం. చనిపోయిన వారిలో కృష్ణయాదవ్(21) సురేష్ యాదవ్(34), శ్రీకాంత్ రెడ్డి(35), రుద్రవికాస్(39), రాజేంద్రరెడ్డి 45)గా తెలిసింది. గాయపడిన వారిలో కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి గన్ మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు సమాచారం. షాక్ కొట్టిన ఘనతో గోకలేనగర్లో విషాధచాయలు అలుముకున్నాయి.