ఇద్దరు పిల్లల రూల్ తొలగింపు చాలదు, స్థానిక సంస్థలకు అధికారాలు యివ్వాలి
30 యేళ్ల ఇద్దరు పిల్లల నియమం సాధించేందేమిటి?
తెలంగాణ ప్రభుత్వం యిటీవల ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ను తొలగిస్తూ 2018 లో చేసిన పంచాయతీ రాజ్ చట్టానికి చేసిన సవరణను అన్నీ వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. జనాభా నియంత్రణ పేరుతో చేసిన ఈ మార్పు కు కాలం చెల్లిందని వారు అభిప్రాయపడ్డారు.
1994 లో అప్పటి ప్రభుత్వం ఈ చర్యను కుటుంబ నియంత్రణ పైన అవగాహన కల్పించటానికి అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధన వలన మూడో సంతానం వున్న వారు స్థానిక సంస్థలలో పోటీకి అనర్హులు అయ్యారు.
పంచాయతీ రాజ్ చట్టం లోని సెక్షన్ 21(3) కు సవరణ చేసి ఇద్దరు పిల్లల నిబంధనను రాష్ట్ర కేబినెట్ తొలగించింది. దీనిని రాష్ట్ర గవర్నర్ ఆమోదీస్తే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ముగ్గురు సంతానం వున్న వారు కూడా అర్హులు అవుతారు.
చట్టం వచ్చేందుకు దారి తీసిన పరిస్థితులు, మొదట అమలు చేసిన రాష్ట్రాలు:
యిలాంటి చట్టాలను రాష్ట్రాలు 1971-81 మరియు 1981-91 మద్యన సరాసరి 2.2 శాతం చొప్పున పెరిగిన జనాభా పెరుగుదల కు దేశం చేపట్టిన కుటుంబ నియంత్రణ కార్యక్రమం విఫలం అయిన కారణం గా గుర్తించారు. 1991 లో జరిగిన జనాభా లెక్కల ప్రక్రియ దీనికి కుటుంబ నియంత్రణ విషయం లో సదుపాయాల లేమి అవి సరిగ్గా అందుబాటులో లేకపోవటం కారణం గా గుర్తించారు. ప్లానింగ్ కమిషన్ 1992 లో ఈ కార్యక్రమం కేంద్రీకృతం గా వుండి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చేయటం వలన జరగడం మూలంగా వచ్చిన లోపం గా గుర్తించింది. దీనితో అటు జనాభా తగ్గలేదు, ఆరోగ్య కార్యక్రమాలు దెబ్బతిని దంపతుల గర్భనిరోధక అవసరాలు తీరటం లేదు అని గుర్తించారు.
దేనితో 1992 లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NDC) ఒక కమిటీ ని ఏర్పాటు చేసి జాతీయ జనాభా విధానాన్ని తీసుకురావటానికి ఏం ఎస్ స్వామినాథన్ నేతృత్వం లో ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. యిది 2010 లోపు జనాభా భర్తీ స్తాయి సంతానోత్పత్తి స్తితికి చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది.
యిది రాష్ట్రాలు తమ స్థాయి లో వాటి పరిస్థితి కి అనుగుణంగా జనాభా నియంత్రణ కొరకు విధానాలు రూపొందించు కోవాలని చెప్పింది. రాజస్థాన్ ఈ నియంత్రణ విధానాన్ని మొట్ట మొదట ప్రవేశ పెట్టగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, హర్యానా తరువాత 1994 లో అమలు చేశాయి.
మొదటగా 197-91 మద్యన ఎక్కువ జనాభా పెరుగుదల నమోదు చేస్తున్న రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు తదుపరి 10 నుండి 15 సంవత్సరాలలో జనాభా భర్తీ స్తాయి సంతానోత్పత్తి స్తితికి లేదా అందులో సగాని కైనా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేనితో ఈ రాష్ట్రాలతో పాటు హర్యానా, ఒరిస్సా కూడా స్థానిక సంస్థల ప్రతినిధులు యిద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు వున్నవారిని అనర్హులను చేసింది. అప్పుడే దేశం లో స్థానిక ప్రజాప్రతినిధులు గా వున్న వాళ్ళు చాలా తక్కువ సంఖ్య లో వుండటం వలన ఈ నియమం పెద్దగా జనాభా పెరుగుదల మీద ప్రభావం చూపదని భావించినా వాళ్ళు ‘నమూనాలుగా’ వుండి ప్రజలకు ఒక దారి చూపినట్టు అవుతుందని భావించారు.
దీనితో ప్రభుత్వ సదుపాయాలు, వసతులు పొందటానికి పెళ్ళికి కనీస వయసు ను పాటించటం, కుటుంబ నియంత్రణ ను ఆరోగ్య భీమాను కు ముడిపెట్టటం లాంటి చర్యల ద్వారా సాధించటానికి పూనుకున్నారు. యింకా తిండి గింజలు ఉచిత విద్య ను కూడా దీనికి అవసరం అయిన చర్యలు గా భావించారు. దీనితో 1970 ల లో జనాభా పెరుగుదల పైన వున్న భయాలు మళ్ళీ ముందుకు వచ్చి ఈ చర్యలకు ఆమోదం లభించింది.
ఈ విధానం నుండి తొలగిన రాష్ట్రాలు; కారణాలు:
ఈ విధానం నుండి 2005 లో అప్పటికి ఈ విధానాన్ని పాటిస్తున్న చత్తీస్గఢ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు మధ్య ప్రదేశ్ 2005 లో తొలగాయి. ఆంధ్ర ప్రదేశ్ నవంబర్ 2024 లో పంచాయతీ రాజ్ బిల్లు, 2024 ను ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ బిల్లు, 2024 ప్రవేశ పెట్టి సవరించింది. దీనికి దేశం లో మొగ ఆడ పిల్లల లింగ నిష్పత్తి లో వస్తున్న మార్పులు ఈ రకమైన చర్యలకు కారణం అయ్యింది. యిందుకు సాంకేతికంగా వచ్చిన మార్పులు దోహద పడ్డాయి.
దీనికి మరో కారణం 2000 లో వచ్చిన జాతీయ జనాభా విధానం లక్షిత దృక్పధం నుండి పునరుత్పత్తి ఆరోగ్య హక్కులను కాపాడే విధానం వైపు తీసుకున్న మొగ్గు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి వయసు మీరుతున్న జనాభా వలన రాష్ట్రం దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ జంటలు మరింత మంది పిల్లలు కనాలని అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాత విధానానికి కాలం చెల్లిందని, యిప్పటికే పొరుగున వున్న ఆంధ్ర ప్రదేశ్ ఈ విధానాన్ని తీసేసిందని చెప్పారు.
విధానం పైన అభిప్రాయాలు:
ఈ మార్పు ఆహ్వానించదగినదే. అయితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ కి పంచాయతీలు యితర స్థానిక సంస్థల అధికారాల పైన నియంత్రణ విధించే హక్కు ఆర్టికల్ 243, 243 zg ప్రకారం వుంది. స్థానిక సంస్థలు రాజ్యాంగ సంస్థలు కావు. రాష్ట్ర అసెంబ్లీ ఆర్టికల్ 84 ద్వారా పార్లమెంటు ఆర్టికల్ 173 లు రాజ్యాంగ హోదా కల్పించటం తో అవి రాజ్యాంగ హోదా కలిగివుంటాయి. వాటి ప్రతినిధుల పైన కుటుంబ సభ్యుల సంఖ్య, కనీస విద్య, యింట్లో మరుగుదొడ్డి వుండటం లాంటి నియమాలు విధించలేరు. జనాభా నియంత్రణ పరిపాలనలో నైతికత ను నెలకొల్పడం నియంత్రణ చట్టం లక్ష్యాలుగా వున్నాయని అన్నారు సెస్ (CESS) లో ప్రొఫెసర్ అయిన సి.హెచ్. బాలరాములు.
పిల్లల సంఖ్య పైన నియంత్రణ వలన రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు, పరిపాలనలో పాలుపంచుకునే హక్కు ను ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు కోల్పోయారు. సుప్రీం కోర్టు లో యిది వ్యక్తి స్వేచ్ఛకు స్వాతంత్రానికి భంగకరమని వాదించినా అంగీకరించ లేదు.
బీ కే పార్థసారథి Vs గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కేసులో సుప్రీం కోర్టు పిల్లల సంఖ్య పైన నిబంధన వ్యక్తిగత గోప్యతకు ఆర్టికల్ 19 మరియు 21 కి భంగకరమనే వాదనను అంగీకరించలేదు. యింకా ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానం మరియు వాటి నుండి సమాన రక్షణ పొందే హక్కుకు భంగకరం అవుతుందని వాదించినా అంగీకరించలేదు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం, 1994 లోని సెక్షన్ 19 (3) ఎక్కువ మంది పిల్లలు వుండే హక్కును హరించటం లేదని కేవలం ఎక్కువ మంది వున్నవారిని మాత్రమే ఎన్నికలలో పోటీపడనీయటం లేదని అభిప్రాయపడింది. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత ఒక పార్శ్వమని అయితే దానికీ రాజ్యాంగం పరిమితులు అనుమతిస్తుందని పేర్కొంటూ నియంత్రణ కు వ్యతిరేక వాదనలను తిరస్కరించింది.
దేశం లో మొత్తంగా 13 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు యిలాంటి నిబంధన విధించాయి. సుప్రీం కోర్టు 2005 ఫిబ్రవరి లోనూ జైల్ సింగ్ అనే మున్సిపాలిటీ సభ్యుడిని హర్యానా మున్సిపల్ చట్టం, 1994 ప్రకారం తొలగించటాన్ని సమర్థించింది. ఆ సమయం లో అది 2003 లో యిచ్చిన మరో తీర్పును ఎత్తిపడుతూ ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారిని ఎన్నికలలో పోటీకి అనర్హులుగా ప్రకటించటాన్ని సమర్థిస్తూ అది ప్రాధమిక హక్కులకు భంగకరం కాదని, అది సహేతుకమే అని కూడా నొక్కి చెప్పింది. హర్యానా చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు అయిన దాదాపు 200 పీటీషన్లను కొట్టేసింది. అది జనాభా నియంత్రణ కోసం కొన్ని ప్రోత్సాహకాలు యివ్వటం కూడా అవసరం అని భావించింది.
అయితే ఈ చర్య వలన బాలుర పట్ల సమాజం లో ఉన్న మొగ్గు కు మరింత ఊతం అందిందని బలరాములు అభిప్రాయ పడ్డారు. ఈ నిబంధన 42 బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్న సందర్భంగా తీసుకుంటున్న చర్యగా తోస్తోంది. ఏమైనా యిది సరియైన చర్యనే. ఏపీ 2004 లోనే ఈ మార్పు చేసింది అన్నారు.
అయితే అసలు ఇద్దరు పిల్లల చట్టం చేసిన తరువాత జరిగిన నష్టం పైన ఎటువంటి అధ్యయనం లేదని అన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ. వేంకటేశు. యిప్పుడు ఎక్కువ మంది యిద్దరు పిల్లలకే పరిమితం అవుతున్నారు కానీ దీనివలన జనాభా తగ్గిందా లేదా అనే దానికి ఆధారాలు లేవు. రాష్రం లో పంచాయతీ లు బలహీనంగా వున్నాయి. వాటికి విధులు చేయటానికి నిధులు, సిబ్బంది ఇవ్వలేదు. ఎన్నిక అయిన వారికి ఎంత మంది పిల్లలు వున్నారు అనేది అప్రస్తుతం అన్నారు.
ఈ విషయం పైన వ్యాఖ్యానిస్తూ గ్రామాలలో భూయజమానుల చేతిలో అధికారం వున్నంత వరకు స్థానిక సంస్థలకు అధికారాలు ఉండనిచ్చారు. అధికారం లోకి వెనుకబడిన తరగతులు రావటం తో 73 రాజ్యాంగ మార్పు ద్వారా వాటి అధికారాలను తొలగించారని ప్రొఫెసర్ బలరాములు అంటారు.
హై కోర్టు న్యాయవాది కే. కొండల్ రావు పిల్లల సంఖ్య పైన సడలింపును ఆహ్వానిస్తూ రిజర్వేషన్లు ఎస్సి, ఎస్టీ, మహిళలకు రాజ్యాంగ బద్దంగా యిచ్చిన 73 వ రాజ్యాంగ సడలింపు బీసీ లను పక్కన పెట్టింది. దీనితో 2010 మే 11 లో కే. జీ. బాలకృష్ణన్ ప్రధాన న్యాయమూర్తి గా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రిజర్వేషన్లు 50 శాతానికి కుదించే అవకాశం వచ్చింది. అయితే ఆ తీర్పు దానికి తగిన తర్కం చెప్పలేదు. రాష్ట్రాలకు రిజర్వేషన్లు యిచ్చే విచక్షణ యివ్వటం తో బీసీ లు మాత్రమే నష్టపోతున్నారు అని చెప్పారు.
హెచ్ సి యూ లో ప్రొఫెసర్ అయిన నాగరాజు పిల్లల సంఖ్యపైన పరిమితుల వలన లింగ నిర్ధారణ పెరిగింది అన్నారు. జనాభా నియంత్రణ కాస్తా కుటుంబాన్ని అదుపు చేసేది గా మిగిలింది. ప్రజలలో మార్పు ద్వారానే జనాభా నియంత్రణ సాధ్యం అన్నారు.
జనాభా అదుపులో వుండాలంటే నియంత్రణకు కాలం చెల్లింది మార్పు రావాలంటే సాంస్కృతిక వెనుకబాటుతనం పోవటానికి ప్రభుత్వం తాను బాధ్యత తీసుకోవాలి చర్యలు చేపట్టాలి. చట్టాల ద్వారా యిది జరగదు. ట్రాఫిక్ నియంత్రణకు ఎక్కువ మంది పోలీసుల ను పెట్టడం ద్వారా కంటే వారిని మానసికంగా పాటించేట్టు చేయగలిగితే అది మరింత సులభం అవుతుంది అన్నారు ఉస్మానియా సోషియాలజీ వర్శిటీ ప్రొఫెసర్ భీనవేణి రామ్ షెపర్డ్.
ఈ విషయం పైన తెలంగాణ పంచాయత్ సర్పంచ్ ల సంఘం మొదటి అధ్యక్షులు భూమన్న యాదవ్ యిద్దరు పిల్లల నిబంధన కు కాలం చెల్లిందని అన్నారు. యిప్పుడు కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. కాబట్టి ఈ మార్పు వలన ఎక్కువ మంది రాజకీయాల లోకి వచ్చే అవకాశం పెద్దగా లేదు. సర్పంచ్ ల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ఉప సర్పంచ్ లతో కలిపిన జాయింట్ చెక్ పవర్ ను తీసివేయాలి. దీనితో వెనుకబడిన వర్గాల నుండి సర్పంచ్ లు అవుతున్న వాళ్ళు అగ్రవర్ణాల నుండి అధికంగా వున్న ఉప సర్పంచ్ ల ముందు కేవలం ఉత్సవ విగ్రహాలు అవుతున్నారు, అని వాపోయారు.
రాజ్యాంగం లో లేని నిబంధన ను చట్ట సభలలో వున్న వారికి వర్తింపచేయకుండా కేవలం దిగువ స్థాయి ప్రతినిధులకే పరిమితం చేశారు. ఇద్దరు పిల్లల నిబంధన బిసి, ఎస్సీ, ఎస్టీ లకు చెందిన నాయకులను ఎక్కువ ప్రభావితం చేసింది. మన దక్షిణ భారత్ దేశం లో జనాభా నియంత్రణ వలన మనకు ఫైనాన్స్ కమిషన్ నిధులు తగ్గిపోతున్నాయి అని అన్నారు తెలంగాణ సర్పంచ్ ల సంఘం జనరల్ సెక్రెటరీ ప్రణీల్ చందర్.
మహిళల పైన ఈ నిబంధన ఎత్తివేత ప్రభావం గురించి శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మాట్లాడుతూ జనాభా నియంత్రణ పేరుతో పెట్టిన నిబంధన యిప్పుడు ఎందుకు తీసివేశారు అనేది స్పస్టత లేదు. ఈ చర్య తమకు ఉపయోగ పడుతుందని ఒక బీసీ నాయకుడు అన్నారు. ఈ చర్చ లో ఎక్కడ మహిళల గురించి ప్రస్తావన లేదు. సడలింపు వలన బీసీ లకు మేలు జరిగితే దానిని ఆహ్వానిస్తాను. అయితే వారిలో అత్యంత వెనుకబడిన కులాల వారికి మహిళలకు యిది ఉపయోగకరం గా ఉంటేనే నే ప్రయోజనం అన్నారు.