అమెరికాలో ప్రభాకరరావు బాగా కోచింగ్ తీసుకున్నారా ?

సిట్ విచారణకు హాజరైన నిందితుడు విచారణ అధికారులనే ఎదురు ప్రశ్నలతో ఛాలెంజ్ చేస్తున్నాడు;

Update: 2025-06-10 11:36 GMT
Telephone Tapping accused T. Prabhakar Rao

టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు టీ. ప్రభాకరరావు బాగా మెంటల్ గా ప్రిపేర్ అయిన తర్వాతే హైదరాబాదుకు వచ్చినట్లున్నాడు. అందుకనే సిట్ విచారణకు హాజరైన నిందితుడు విచారణ అధికారులనే ఎదురు ప్రశ్నలతో ఛాలెంజ్ చేస్తున్నాడు. విషయం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) లో ఏ1 నిందితుడు అయిన ప్రభాకరరావు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఓడిపోయిన కొంతకాలానికి అమెరికాకు పారిపోయిన విషయం తెలిసిందే. నిందితుడు అమెరికా(America)కు ఎందుకు పారిపోయాడంటే ట్యాపింగ్ కేసులో కీలక పాత్రదారుడు కాబట్టే. బీఆర్ఎస్ హయాంలో ప్రత్యర్ధులకు చెందిన, అనుమానితులైన సుమారు 4200 మొబైల్ ఫోన్లు ట్యాపయ్యాయి. ట్యాప్ అయిన ఫోన్లలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు కూడా ఉన్నాయి. అందుకనే రేవంత్(Revanth) సీఎం కాగానే ట్యాపింగ్ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) నియమించారు.

సిట్ ఆధ్వర్యంలో మొదటి అరెస్టు జరిగిన మరుసటిరోజే ప్రభాకరరావు(Accused Prabhakar Rao) అమెరికాకు పారిపోయాడు. ట్యాపింగ్ విచారణలో డీఎస్పీ, అడిషినల్ ఎస్పీ, డీసీపీ ర్యాంకు అధికారులు ప్రణీత్ రావు, తిరుపతయ్య, భుజంగరావు, రాధాకిషన్ రావును సిట్ అరెస్టుచేసింది. విచారణలో వీళ్ళంతా అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ ప్రభకరరావు ఆదేశాల ప్రకారమే తాము ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. విచారణలో చెప్పిన అంశాలనే తర్వాత అఫిడవిట్ రూపంలో కోర్టులో కూడా దాఖలుచేశారు. ఇపుడు విచారణలో ట్యపింగ్ తో తనకేమీ సంబంధంలేదని, తాను ట్యాపింగ్ చేయమన్నట్లుగా ఆధారాలు ఉంటే చూపాలని ప్రభాకరరావు బుకాయించవచ్చు. అయితే నిందితుడే ప్రధాన పాత్రదారుడు అనేందుకు సిట్ దగ్గర తగినన్ని ఆధారాలున్నట్లు సమాచారం.

ఇక్కడే ప్రభాకరరావు వైఖరిపై కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. అవేమిటంటే నిజంగానే ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేకపోతే మరి ఇండియా నుండి అమెరికాకు 2024 మార్చి 12వ తేదీన ఎందుకు పారిపోయినట్లు ? తాను శాశ్వతంగా అమెరికాలోనే ఉండిపోయేట్లుగా రాజకీయ శరణార్ధిగా పరిగణించాలని అమెరికా ప్రభుత్వానికి ఎందుకు రిక్వెస్టు పెట్టుకున్నాడు ? ట్యాపింగ్ కేసులో తనను ఇరికించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రభాకరరవుకు ఎందుకు అనుమానం వచ్చింది ? ఇంటెలిజెన్స్ బాస్ గా ఉన్నపుడు 4200 ఫోన్లు ట్యాపింగ్ జరిగితే మరి తానేమి చేస్తున్నాడు ? ఒక టీవీ ఛానల్ కార్యాలయంలో ట్యాపింగ్ ఆరోపణల్లో అరెస్టుయిన వాళ్ళు, ప్రభకరరావు ఎందుకు కలుసుకునే వారు ? ట్యాపింగ్ జరగలేదని ప్రభాకరరావు కూడా అనటంలేదు. అయితే టెలిఫోన్ ట్యాపింగ్ తో తనకు ఏమీ సంబంధంలేదని మాత్రమే అంటున్నాడు.

ఇంటెలిజెన్స్ బ్యూరోలో రివ్యూ కమిటి పనిచేసిందని అన్నీ వ్యవహారాలను కమిటీయే చూసుకుందని ప్రభకరరావు ఎదురుదాడి చేస్తున్నాడు. కమిటీలో తాను సభ్యుడిని కాదు కాబట్టి ట్యాపింగ్ ఆరోపణలతో తనకు సంబంధంలేదని చెప్పాడు. పలానా ఫోన్ ను ట్యాపింగ్ చేయాలని తాను ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆధారాలుంటే చూపించాలని సిట్ అధికారులనే సవాలు చేశాడు. తాను అమెరికాకు వెళ్ళిన తర్వాత హైదరాబాదులో ధ్వంసం అయిన హార్డ్ డిస్కుల ఘటనతో తనకేమి సంబంధం అని నిలదీశాడు. రివ్యూ కమిటి సభ్యులను ఈకేసులో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదో చెప్పాలని సిట్ ను ఏ1 అడగటమే విచిత్రంగా ఉంది.

సిట్ విచారణను ఎదుర్కొన్న తీరుచూసిన తర్వాత ప్రభాకరరావు మెంటల్ గా బాగా ప్రిపేరయ్యే అమెరికా నుండి హైదరాబాదుకు వచ్చినట్లు అర్ధమైపోతోంది. 15 మాసాలు అమెరికాలో ఉన్నపుడు ఎవరో ఏ1 నిందితుడిని మెంటల్ గ బాగా ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఎదురుదాడులు చేయాలన్న స్ధిరమైన నిర్ణయంతోనే ఏ1 విచారణకు హజరయ్యాడు. ట్యాపింగ్ కేసులో తాను నిందితుడిని కాదు బాధితుడిని అని అనటమే కొసమెరుపు.

Tags:    

Similar News