TVK చీఫ్ విజయ్ బస్సు డ్రైవర్‌పై కేసు..

బాధితులు ఫిర్యాదు చేయకపోయినా.. సుమోటోగా కేసు నమోదు చేయాలన్న మద్రాస్ హైకోర్టు..

Update: 2025-10-05 11:57 GMT
Click the Play button to listen to article

తమిళనాడు(Tamil Nadu) పోలీసులు తాజాగా తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ చీఫ్ విజయ్ (Vijay)బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. కరూర్‌లో సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రస్తుతం మద్రాస్ హై కోర్టు(High Court)లో విచారణ జరుగుతోంది.

ఆ రోజు విజయ్ ప్రయాణిస్తున్న బస్సును కొంతమంది అభిమానులు తమ వాహనాలతో ఫాలో అయ్యారు. మార్గమధ్యంలో ఇద్దరు బైకర్లను బస్సు ఢీ కొట్టి ముందుకు వెళ్లిపోయిన దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. దీంతో నిర్లక్ష్యంగా బస్సు నడిపిన బస్సు డ్రైవర్‌పై మీరు ఎందుకు కేసు నమోదుచేయలేదని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. అలాగే ఆ బస్సును సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ రెండు ఘటనల్లో బాధితులు ఫిర్యాదు చేయకపోయినా.. సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు సూచించింది.

Tags:    

Similar News