‘ఇక్కడ ఎంట్రీ ఫీజు లైంగిక సంతృప్తినివ్వడమే’

మాలీవుడ్ లో జస్టిస్ కే హేమ కమిటీ నివేదిక ప్రకంపనలు రేపుతోంది. అనేకమంది ప్రముఖులపై లైంగిక ఆరోపణలు రావడంతో సినీ ఇండస్ట్రీస్ ప్రాతినిధ్యం వహించే ‘ అమ్మా’ కమిటీ ..

Update: 2024-08-28 08:00 GMT

కేరళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ కే.హేమ కమిటీ నివేదిక మంటలు రేపుతోంది. ఒక్కో నటుడిపై లైంగిక ఆరోపణలు బయటపడుతుండటంతో వారంతా రాజీనామాలు చేస్తూ తమ సచ్చిశీలతను నిరూపించుకుంటామని భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.

దాదాపు ఐదు సంవత్సరాల పాటు నివేదికను తొక్కిపట్టిన కేరళ ప్రభుత్వం హైకోర్టు ఆగ్రహంతో ఎట్టకేలకు బయటపెట్టింది. నివేదిక లోని కొన్ని అంశాలు లీక్ కావడంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఇవి ఈ మధ్య ఎక్కువ కావడంతో మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం (అమ్మ) వాటిని ఎదుర్కోలేకపోతోంది. అనివార్య పరిస్థితుల్లో సూపర్ స్టార్ మోహన్‌లాల్ దాని అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత మంగళవారం (ఆగస్టు 27) మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీని వైదొలగాలని నిర్ణయించుకుంది.

AMMA సాధారణ ప్రతిచర్య
మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, దోపిడీ సంస్కృతిని బట్టబయలు చేసిన హేమ కమిటీ నివేదిక వచ్చి చాలా కాలమైంది. అయితే ఇందులో అంశాలపై అమ్మ సాధారణంగా ప్రతిస్పందించింది. పరిస్థితి లోని తీవ్రతను కమిటీ సరిగా అంచనావేయలేదు.
దీనిపై సమీక్షించి వారం తర్వాత స్పందిస్తామని ఆఫీస్ బేరర్లు క్యాజువల్‌గా ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ, బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర, కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ రంజిత్‌ తనపై లైంగిక వేధింపులకు దిగారని ఆరోపించింది. 2009 లో ఓ సినిమా షూటింగ్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఈమె వాయిస్ కు అదనంగా మరికొంతమంది నటీమణులు గొంతు విప్పడంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.
వినాశకరమైన మీడియా సమావేశం
ఈ సమయంలో, AMMA మీడియా సమావేశాన్ని నిర్వహించింది. సాధారణంగా నివేదికను స్వాగతించింది. అయితే హేమ కమిటీ వెల్లడించిన విధంగా మలయాళ చిత్ర పరిశ్రమను నియంత్రించే "పవర్ గ్రూప్" అని పిలవబడే ఉనికిని మాత్రం అమ్మా ఒప్పుకోలేదు, అసలు అలాంటివి లేవని ఖండించింది.
ఈ సమావేశం ఒక దయనీయమైన ప్రదర్శన మారింది. ఆరోపణలు వచ్చిన సిద్దిఖ్ మేనేజ్ చేసుకోగా, మిగిలిన ఆఫీస్ బేరర్లు, నటులు అయిన జోమోల్, జయన్ చెర్తల తడబడ్డారు. మీడియా సమావేశం ముగిసిన వెంటనే, నటి రేవతి సంపత్ 2019లో సీనియర్ నటుడు, అమ్మా జనరల్ సెక్రటరీ సిద్ధిక్‌పై తాను చేసిన మీ-టూ ఆరోపణను మరోసారి గుర్తు చేశారు.
పెరుగుతున్న అగాధం..
ఈ గందరగోళ వాతావరణం మధ్య, సిద్ధిక్ తాను ఇంకా కమిటీలో ఉండటం తగదని అమ్మా నుంచి వైదొలిగాడు. అయితే సిద్దిక్ రాజీనామా తర్వాత ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాల్సిన జాయింట్ సెక్రటరీ బాబురాజ్ పై కూడా ఇదే తరహ ఆరోపణలు రావడంతో గందరగోళం మరింత ముదిరింది.
కొల్లాం నుంచి సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అయిన నటుడు-రాజకీయ నాయకుడు ఎం. ముఖేష్‌తో పాటు సహచర నటులు జయసూర్య, 'మణియన్‌పిళ్లై' రాజు, రియాస్ ఖాన్, 'ఇడవేల' బాబులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీనితో అసోసియేషన్ లో చీలిక వచ్చింది. నాయకత్వం చర్య తీసుకోవడానికి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వచ్చింది.
అనివార్యమైనది
వివాదం క్రమక్రమంగా విస్తరించడంతో మంగళవారం, AMMA ఎట్టకేలకు దాని మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేసినట్లు ప్రకటించింది, సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఆన్‌లైన్ సమావేశంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, వాట్సాప్ గ్రూప్ చాట్ బయటకు వచ్చింది. చాలా మంది ఈ చర్యను పరిశ్రమలో జవాబుదారీతనం సంస్కరణల దిశగా అవసరమైన అడుగుగా భావిస్తున్నారు.
మోహన్ లాల్ రాజీనామా కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. ఇది నివేదిక బయటపెట్టిన వాస్తవాలకు ప్రతిరూపం. ఇది అమ్మా పునాదిని కదిలించాయి. అనేకమంది నటీనటులు తమ భయానక అనుభవనాలను బయటపెడుతుండటంతో పరిశ్రమ తీవ్ర కుదుపులకు లోనైంది.
మాలీవుడ్ దిగ్గజాల మూగ, చెవిటితనం..
మలయాళ సినిమాకి రెండు ప్రధాన మూలస్తంభాలు అయిన మోహన్‌లాల్, మమ్ముట్టి ఈ నివేదికను బహిరంగపరిచిన తర్వాత వారం రోజుల పాటు మౌనంగా ఉండటంపై వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.
మోహన్‌లాల్‌ ‘అమ్మ’ అధ్యక్షుడిగా ఉన్న కారణంగా ఆయనపై ఒత్తిడి మరింత ఎక్కువైంది. AMMA అధ్యక్షుడిగా, కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతోపాటు.. మమ్మల్ని సరిదిద్దినందుకు, విమర్శించినందుకు కృతజ్ఞతలు అని అన్నారు. ఆ తరువాత ఒక్కమాట కూడ మాట్లాడలేదు. మమ్ముట్టి కూడా కనీసం నోరు తెరవలేదు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా నటుడు సురేష్ గోపీ కూడా ఈ విషయం పై విలేకరులు అడిగిన ప్రశ్నకు నోరు మెదపలేదు.
చివరి ప్రయత్నం
ఈ పరిణామాలపై గోప్యంగా ఉన్న ఒక ప్రముఖ నటుడు ది ఫెడరల్‌తో మాట్లాడారు.. మోహన్‌లాల్ తన రాజీనామాను ప్రకటించే ముందు మమ్ముట్టిని సంప్రదించి అతని సలహా కోరినట్లు చెప్పారు. "అమ్మా రాజకీయ సంస్థ కానందున, తదుపరి ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని, వాటిపై పోరాడటం ప్రభావవంతంగా ఉండదని భావించి, ప్రస్తుతం పదవి నుంచి వైదొలగడం మాత్రమే ఆచరణీయమైన పని అని మమ్ముట్టి అతనితో చెప్పారు" అని నటుడు బయటపెట్టారు.
రెండు నెలల క్రితమే ఏర్పాటు చేసిన కమిటీని మోహన్‌లాల్ రాజీనామా చేసి రద్దు చేయడాన్ని పలువురు సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత నాయకత్వం పరిస్థితిని నిర్వహించడం పట్ల గణనీయమైన సంఖ్యలో నటీనటులు అసంతృప్తితో ఉన్నందున, అసోసియేషన్‌లో చీలిక సంభవించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
యువ రక్తం రావాల్సిందే..
AMMA బాధ్యతను నొక్కిచెప్పి, హేమ కమిటీ నివేదికలోని అంశాలను అంగీకరించిన పృథ్వీరాజ్, తరువాత ఆయన విమర్శలు చేయడంతో కమిటీ రద్దుకు ఒత్తిడి తెచ్చాయి. సంఘం పగ్గాలు యువకులే చేపట్టాలని సీనియర్ నటీనటులు సూచించినట్లు మంగళవారం నటీనటుల వాట్సాప్ గ్రూపులో జరిగిన చర్చలో స్పష్టమైందని కొంతమంది సినీ సన్నిహితులు చెబుతున్నారు.
“ నైతిక కారణాలతో కమిటీని రద్దు చేయడం ఏకగ్రీవ నిర్ణయం. తీవ్రమైన ఆరోపణలు, ముఖ్యంగా లైంగిక వేధింపులు తలెత్తినప్పుడు, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా దర్యాప్తును సులభతరం చేయడం ఉత్తమమైన చర్య, ”అని రద్దు చేయబడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు నటుడు జాయ్ మాథ్యూ అన్నారు.
‘ అమ్మ’ వైఫల్యం
2017లో నటుడు దిలీప్‌కు సంబంధించిన లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ‘అమ్మా’ నిరంతరం పరిశీలనలో ఉంది. ఆ సమయంలో బాధితురాలికి అండగా నిలబడటంతో అమ్మా విఫలమయింది. ఇది విస్తృత ప్రజాగ్రహానికి దారి తీసింది. ఫలితంగా కొంతమంది ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) సభ్యులు రాజీనామా చేసి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సమయంలో దిలీప్ కోసం ప్రార్థిస్తామని మోహన్ లాల్ ప్రకటించడంతో వివాదం చెలరేగింది. ఇది ద్వంద్వ ప్రమాణం అని విమర్శలు వ్యక్తం కావడంతో దిలీప్ అమ్మా అసోసియేషన్ నుంచి వైదొలిగాడు.
అసోసియేషన్ మహిళలను ఆఫీస్ బేరర్లుగా నియమించడం ద్వారా ఒక రూపాంతరం చెందడానికి ప్రయత్నించినప్పటికీ, సంస్థ వైఖరి చాలావరకు పితృస్వామ్య వైఖరినే అనుసరించింది. ఇప్పుడు, AMMA పై విమర్శలు బహిరంగంగా రావడం మొదలెట్టాయి. దాని ప్రముఖ సభ్యులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది మహిళలు తమ కష్టాలను బహిరంగంగా చెప్పడం ప్రారంభించే సరికి దానికి ఊపిరి సలపడం లేదు.
జవాబుదారీతనం..
“అమ్మ మాత్రమే కాదు, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా), నిర్మాతల సంఘాలతో సహా పరిశ్రమలోని ఇతర సంస్థలు కూడా బాధ్యత వహించాలి. హేమ కమిటీ నివేదిక కేవలం మగ నటుల లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించినది కాదు, అనేక ఇతర సమస్యలను సైతం ఎత్తి చూపింది” అని మరొక నటుడు ఎత్తి చూపారు.
హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో వేధింపుల వ్యవస్థాగత సంస్కృతిని బహిరంగం చేసింది. ఇక్కడ మహిళలు నిజాలను బయటపెడితే ఎక్కడ తమ కెరీర్ ఎక్కడ నాశనం అవుతుందో అన్న భయంతో మౌనంగా ఉంటారని తెలియజేసింది. ఇది అప్రసిద్ధ "కాస్టింగ్ కౌచ్" సందర్భాలను వివరించింది. ఇక్కడ పరిశ్రమలో ప్రవేశించాలంటే దాని ఎంట్రీ ధరగా లైంగికంగా సహకరించడంగా వ్యవస్థగా మారింది.
మార్పుకు అవకాశం
2017 లో జరిగిన ఓ దాడి కేసులో కేసు నేపథ్యంలో ఏర్పడిన WCC, న్యాయం, సంస్కరణ కోసం అవిశ్రాంతంగా పోరాటం సలిపింది. పరిశ్రమను పీడిస్తున్న వ్యవస్థాగత సమస్యలను పరిశోధించే లక్ష్యంతో హేమా కమిటీని ఏర్పాటు చేయడంలో వారి ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. నివేదిక బయటకు రావడం మార్పు కోసం పోరాడిన ఇతరులకు చేదు.. తీపి విజయం. ఇది వారి పోరాటాలను హైలైట్ చేసింది. మలయాళ సినిమాలో సాంస్కృతిక మార్పు యొక్క తక్షణ అవసరాన్ని హైలైట్ చేసింది.
‘అమ్మ’ ఎగ్జిక్యూటివ్ కమిటీ రద్దును చాలామంది పునర్నిర్మించడానికి, సంస్కరించడానికి ఒక అవకాశంగా చూస్తున్నారు. అయితే ఇది మార్పుకు కట్టుబడి ఉన్న కొత్త నాయకత్వంతో నింపాల్సిన శూన్యతను మిగిల్చింది. నివేదిక సిఫార్సులను అమలు చేయడం గురించి చర్చలు ప్రారంభమైనప్పుడు ఓ విషయం అర్థమైంది. పరిశ్రమ ఇప్పుడు ఒక క్రాస్‌రోడ్‌లో ఉంది. దానిలో అర్థవంతమైన మార్పుకు అవకాశం ఉంది. అయితే మార్పు రావాలంటే రాజకీయంగా సమగ్రమైన చర్యలు లేకుంటే మార్పు సాధ్యం కాదు.


Tags:    

Similar News