నేడు TVK విజయ్ రాష్ట్ర సదస్సు..
మధురైలోని పరపతికి భారీగా చేరుకుంటున్న పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఫ్యాన్స్..
తమిళనాడు(Tamil Nadu)లో వచ్చే ఏడాది ఏప్రిల్-మే మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు ఇప్పటి నుంచే బహిరంగ సభలు, సమావేశాలకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్, సినీనటుడు విజయ్(Vijay) గురువారం (ఆగస్టు 21) మధురైలోని పరపతిలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీని ప్రకటించిన తర్వాత జరుగుతోన్న రెండో రాష్ట్ర సదస్సు ఇది. గత సంవత్సరం విల్లుపురం జిల్లాలోని విక్రవాండిలో తొలి రాష్ట్ర సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పార్టీ అభిమానులు, మద్దతుదారులు, ఫ్యాన్స్ భారీగా వేదిక వద్దకు చేరుకున్నారు.
కూలిన జెండా స్తంభం..
టీవీకే పార్టీ జెండాను ఎగురవేయాల్సిన స్తంభం బుధవారం కూలిపోయింది. ఆగి ఉన్న నాలుగు చక్రాల వాహనంపై పడడంతో వాహనం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
అధికారంలో ఉన్న డీఎంకేకు, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా విజయ్ గళం విప్పారు. అయితే ప్రస్తుతం ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారన్న దానిపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం జన నాయగన్ చిత్రంలో విజయ్ నటిస్తున్నారు.