‘హర్యానాకు ఒక్క నీటి బొట్టు కూడా వదలం’

స్పష్టం చేసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్..;

Update: 2025-05-06 07:44 GMT
Click the Play button to listen to article

నీటి పంపకాల్లో హర్యానా(Haryana), పంజాబ్ (Punjab) రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో..పంజాబ్ శాసనసభ సోమవారం కీలక తీర్మానం చేసింది. నీటి వనరుల శాఖ మంత్రి బరీందర్ కుమార్ గోయల్ ప్రవేశపెట్టిన తీర్మాణంపై చాలా సేపు సభలో చర్చ జరిగింది. చివరకు ప్రతిపక్షాలు కూడా ఈ తీర్మానానికి మద్దతు లభించింది. ఈ సందర్భంగా ఒక్క నీటి బొట్టును కూడా హర్యానాకు వదిలేదిలేదని స్పష్టం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(CM Bhagwant Mann). “చట్ట విరుద్ధంగా బీబీఎంబీ (BBMB) సమావేశాన్ని ఏర్పాటు చేసి పంజాబ్ నీటి వాటాను హర్యానాకు తీసుకెళ్లే కుట్ర జరుగుతోంది. హర్యానా రాష్ట్రం మార్చి 31 నాటికి 103 శాతం నీటి వాటాను వాడుకుంది. పంజాబ్‌కు అదనంగా నీరు రానందున హర్యానాకు నీళ్లివడం సాధ్యపడదు’’ అని కుండబద్దలుకొట్టారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కలిసి భాక్రా-బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు (బీబీఎంబీ)ను అడ్డం పెట్టుకుని పంజాబ్ హక్కులను హరించాలని చూస్తున్నారని గోయల్ మండిపడ్డారు. గత మూడేళ్లలో తమ ప్రభుత్వం ప్రతి పొలానికి కాలువల ద్వారా నీరు చేరేలా పెద్ద ఎత్తున పనులు చేపట్టిందని, 2021 నాటికి కేవలం 22 శాతం పొలాలకు మాత్రమే నీరు లభించగా.. ప్రస్తుతం ఇది 60 శాతానికి చేరిందని వివరించారు. హర్యానా ఏప్రిల్ 6న తాగునీటి అవసరాల కోసం నీరు కావాలని కోరినపుడు.. మానవతా దృక్పథంతో 4వేల క్యూసెక్కుల నీటిని ఇచ్చామని గుర్తుచేశారు.

‘‘హర్యానా జనాభా 3 కోట్లు. తాగునీరు సహా అన్ని అవసరాలకు 1,700 క్యూసెక్కులు సరిపోతాయి. అయితే అకస్మాత్తుగా 8,500 క్యూసెక్కులు కావాలని అడుగుతున్నారు. ఇది అసాధ్యమం.’’ అని గోయల్ మండిపడ్డారు. బీజేపీ చేతిలో బీబీఎంబీ కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు. పంజాబ్ హక్కుల పరిరక్షణ కోసం బోర్డును పునర్వ్యవస్థీకరించాలంటూ డిమాండ్ చేశారు.  

రాబోయే రోజుల్లో ఆప్(AAP) పాలిత పంజాబ్–బీజేపీ(BJP) పాలిత హర్యానా మధ్య నీటి వివాదం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశలున్నాయి.

Tags:    

Similar News