ప్రొబేషనరీ ఐఏఎస్, పూజ ఖేద్కర్ పై వివాదం ఏంటీ?

నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్లు, పరిమితి మించిన వర్తించని ఓబీసీ క్రిమిలేయర్, అర్హత లేకున్నా అధికారిక కారు, సీనియర్ అధికారి నేమ్ ప్లేట్ తీసేసి తన పేరు రాసుకోవడం..

Update: 2024-07-11 12:01 GMT

యూపీఎస్సీ పరీక్ష ఎంపిక కోసం అధికార దుర్వినియోగం, నకిలీ సర్టిఫికెట్లను సమర్పించడం  అర్హత లేకున్నా ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించడంపై ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజ ఖేడ్కర్ ను పూనే నుంచి వాషిమ్ కు బదిలీ చేశారు.

ఆమె సైరన్, VIP నంబర్ ప్లేట్ ఉన్న ప్రైవేట్ ఆడి కారును ఉపయోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. సీనియర్ అధికారులకు మాత్రమే దక్కే అధికారులు ఒక ప్రొబేషనరీ అధికారికి దక్కడం ఏంటని మీడియా ప్రశ్నించింది. దీనితో మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. సహాయ కార్యదర్శి ఎస్ఎం మహాదిక్ సంతకం పేరు మీద వెలువడిన ఉత్తర్వూ లో పరిపాలన కారణాలతో పూజను బదిలీ చేసినట్లు పేర్కొంది.
అయితే, ఆమెపై వచ్చిన వివిధ ఫిర్యాదులకు సంబంధించి ప్రొబేషనరీ అధికారి విచారణను ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఎర్ర బుగ్గ ఉన్న ‘ఆడి’
మీడియా నివేదికల ప్రకారం, ఖేద్కర్ తన ప్రైవేట్ ఆడి కారుపై "గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర" అనే పేరుతో ఉన్న స్టిక్కర్, కారుపైన ఎరుపు-నీలం బల్బు ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె అసిస్టెంట్ కలెక్టర్‌గా చేరడానికి ముందు కూడా VIP నంబర్ ప్లేట్‌తో కూడిన అధికారిక కారు, వసతి, తగినంత సిబ్బందితో అధికారిక ఛాంబర్, ఒక కానిస్టేబుల్‌ను కోరింది. ట్రైనీ అధికారి ఈ అధికారాలకు అర్హులు కాదు. అయినప్పటికీ నిబంధనలు బేఖాతరు చేసి ఈ అధికారాన్ని అనుభవించారు.
ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా తన పలుకుబడిని ఉపయోగించుకున్నారని, తన కుమార్తె డిమాండ్లను తీర్చమని పూణేలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఒత్తిడి తెచ్చారని కూడా కొన్ని నివేదికలు బయటపడ్డాయి. కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇలాంటి దర్పాన్నే ఆమె ప్రదర్శించిందని తేలింది. పూణే కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అధికారి అజయ్ మోర్ నేమ్ ప్లేట్ ను తొలగించి, దానిపై తన పేరు రాసుకుందని తేలింది.
UPSC ఎంపిక లో..
పూజ ఖేద్కర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో తన స్థానాన్ని కాపాడుకోవడానికి నకిలీ వైకల్యం, OBC సర్టిఫికేట్‌లను సమర్పించిందని మరో వివాదం బయటకు వచ్చింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)కు సమర్పించిన పత్రాల ప్రకారం, ఖేద్కర్ OBC కేటగిరీ కింద UPSC పరీక్షకు హాజరయ్యారు. ఆమె అభ్యసన వైకల్యంతో సహా బహుళ వైకల్యాలను కలిగి ఉందని నివేదికలో పేర్కొంది అలాగే ఆమె UPSC పరీక్ష సమయంలో ప్రత్యేక వసతిని కోరింది. యూపీఎస్సీకి సమర్పించిన సర్టిఫికెట్లలో ఎక్కడా కూడా తన వైకల్యానికి సంబంధించి పర్సంటెజ్ మెయిన్ టైన్ చేయలేదని తెలిసింది.
విజయ్ కుంభార్ అనే ఆర్టీఐ కార్యకర్త తన వైకల్య ధృవీకరణ పత్రం వెరిఫికేషన్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కి రావాలని కోరారు. అయితే 2022 లో చైనా వైరస్ కారణంగా వైద్య పరీక్షకు హాజరు కావడానికి ఆమె నిరాకరించారు.
వైద్య పరీక్షలకు ఎర్రజెండా..
పూజ ను చాలా సార్లు వైద్య పరీక్షలకు రావాలని కోరిన వివిధ కారణాలతో నిరాకరిస్తూనే ఉంది. ఇలా దాదాపు ఐదు సార్లు జరిగింది. చివరకు స్థానిక ఆసుపత్రి నుంచి నకిలీ వైకల్యం ఉన్న ధృవీకరణ పత్రాన్ని సమర్పించింది. తరువాత ప్రొబేషనరీ అధికారిగా చేరింది. క్యాట్ లో ఆమె సమర్పించిన సర్టిఫికెట్లను యూపీఎస్సీ సవాల్ చేసింది. అయితే తరువాత ఏం జరిగిందో ఏమో కానీ మరోసారి జాయినింగ్ ఆర్డర్ ను పొందారు.
ఖేద్కర్ OBC కేటగిరీ కింద UPSC పరీక్షకి హాజరయ్యారు. ఇక్కడ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ పరిమితి రూ. 8 లక్షల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం. అయితే, ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్, మాజీ రాష్ట్ర ప్రభుత్వ అధికారి, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు, తన ఆస్తి విలువ రూ. 40 కోట్లు అని, వార్షిక ఆదాయం రూ. 49 లక్షలు అని నివేదించారు. ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి (VBA) అభ్యర్థిగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు.
UPSC పరీక్షలో ఆల్-ఇండియా ర్యాంక్ (AIR) 841 సాధించిన 2023-బ్యాచ్ IAS అధికారిగా ఎంపిక అయ్యారు. పూజ ఇప్పుడు వాషిమ్ జిల్లాలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు, అక్కడ ఆమె జూలై 30, 2025 వరకు శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Tags:    

Similar News