ఐపీఎల్: ముంబాయి ఇండియన్స్ తొలి విజయం సాధిస్తుందా?

అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న ముంబై, కనిపిస్తున్న బూమ్రా లేని లోటు;

Update: 2025-03-31 13:32 GMT
ముంబాయి ఇండియన్స్ ఆటగాళ్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో ఆసక్తికరమైన పోరాటానికి రంగం సిద్ధమైంది. నేడు ముంబై ఇండియన్స్, ఢిపెండింగ్ ఛాంపియన్ కోల్ కత నైట్ రైడర్స్ తో సొంత మైదానంలో తలపడబోతోంది.

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగబోతుందనడంలో సందేహం లేదు. ఐపీఎల్ సీజన్ ను వరుస ఓటములతో ప్రారంభించడం ఎంఐకి కొత్తకాదు. ఇంతకుముందు సీజన్ లలో కూడా ఆ జట్టు మొదట్లో ఓడినా చివర్లో అద్భుతంగా ఫుంజుకుని టైటిల్ ఎగరేసుకుపోయింది.
టోర్నమెంట్ లో ముంబై ఇప్పటి వరకూ బౌలింగ్, బ్యాటింగ్ లో తమ స్థాయి మేరకు రాణించలేకపోయింది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ లో మ్యాచ్ ఫినిషర్ లేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది.
రోహిత్ శర్మ బ్యాటింగ్ లో వరుసగా రెండు మ్యాచ్ లలో ధాటిగా ప్రారంభించిన ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. మరో ఒపెనర్ ర్యాన్ రికెల్టన్ ఇంకా లయ అందుకున్నట్లు కనిపించలేదు.
అతను మొదటిసారిగా ఐపీఎల్ లో ఆడుతున్నాడు. భారత పిచ్ లపై అనుభవం లేకపోవడంతో బ్యాటింగ్ లో తడబడుతున్నాడు. దక్షిణాఫ్రికాలో బాగా రాణించినప్పటికీ ఇక్కడ ప్రస్తుతం అనుకున్నంత మేర రాణించలేకపోయాడు.
గుజరాత్ పై రాణించిన సూర్య..
జీటీతో జరిగిన సూర్య కుమార్ యాదవ్ 48 పరుగులు చేసి ఫామ్ ను అందుకున్నాడు. కానీ ఇంకా తన స్థాయి మేరకు రాణించలేదనే చెప్పాడు. వరుసుగా తుది జట్టును మార్చడం కూడా ఆ జట్టుపై ప్రభావం చూపుతోంది. టిమ్ డేవిడ్ లాంటి ఫినిషర్ లేకపోవడం కూడా జట్టును ఇబ్బంది పెడుతోంది.
సూర్యకుమార్, తిలక్ వర్మ మాత్రమే అనుకున్నంత మేరకు రాణించడం జట్టుకు కాస్త ఊరటనిచ్చే అంశం. అంతకుముందు రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ తీసుకున్న హార్డిక్ పాండ్యా జట్టును విజేతగా నడపడంలో విఫలమవుతున్నాడు.
జస్ప్రీత్ భూమ్రా లేకపోవడం బౌలింగ్ యూనిట్ దారుణంగా దెబ్బతింది. ట్రెంట్ బౌల్ట్, రీస్ టోప్లీలతో కూడిన దళం కొత్త బంతిని పంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం దీపక్ చాహార్ పేస్ దాడికి నేతృత్వం వహిస్తున్నాడు.
రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ ఓటమి పాలైంది. కాబట్టి ఈ మ్యాచ్ లో కేకేఆర్ కు భారీ విజయం అవసరం.
కొత్త సారథి..
అజింక్య రహానే నేతృత్వంలోని కేకేఆర్ జట్టు లో ప్రస్తుతం బ్యాటింగ్ లో బలంగానే కనిపిస్తోంది. క్వింటన్ డికాక్ కు తోడు సునీల్ నరైన్ బ్యాటింగ్ ఆ జట్టుకు ఉపయోగపడుతోంది.
కానీ ప్రస్తుతం నరైన్ అనారోగ్యం బారినపడినట్లు సమాచారం. కేకేఆర్ కు మరో బ్యాటింగ్ ఆప్షన్ గా మొయిన్ అలీ కూడా ఉన్నాడు. తరువాత రహనే, వెంకటేష్ అయ్యర్, అంగ్రీష్ రఘువంశీ ఉన్నారు. చివరల్లో హార్డ్ హిట్లర్లు రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ తో మంచి లైనప్ ఉంది. డెత్ ఓవర్లలో వీరు విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది.
హర్షిత్ రాణా, వైభవ్ అరోరా కొత్తబంతితో మంచి ఆరంభాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. వీరికి తోడు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ కూడా ఉన్నారు. అయితే కేకేఆర్ నిజమైన బౌలింగ్ బలం మొత్తం వారి స్పిన్ లో దాగి ఉంది. మిస్టరీ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఒక్క స్పెల్ వేస్తే చాలు మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయే అవకాశం ఉంది.
గత సీజన్ లో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్, ముంబై పై వాంఖడే స్టేడియంలోనే విజయం సాధించింది. ఇక్కడ 12 సంవత్సరాల తరువాత తొలిసారి కేకేఆర్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోసారి అలాంటి గెలుపు సాధించాలని నైట్ రైడర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. 
Tags:    

Similar News