గేల్ రికార్డు బద్దలు.. 19 సిక్స్ లతో యంగ్ క్రికెటర్ తుఫాన్ ఇన్సింగ్స్
బాదుడు..వీర బాదుడు.. ఒకరు అగ్ని, ఇంకోకరు వాయువు.. ఒకరు ఆరు బంతులను సిక్స్ లు గా మలిస్తే.. మరొకరు మూడొందల స్ట్రైక్ తో పరుగుల వరద పారించారు. మొత్తానికి 20 ఓవర్లలో
అదేం బాదుడు.. ఇన్నాళ్లు క్రికెట్ లో గేల్, రస్సెల్, బ్రెండన్ మెక్ కల్లం, రింకూసింగ్ లాంటి హర్డ్ హిట్టర్లను చూశాం. కానీ శనివారం ఈ విధ్వంసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు ఇండియన్ యంగ్ క్రికెటర్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 సిక్స్ లు బాదేసీ ఔరా అనిపించాడు. అతడెవరో కాదు.. ఆయూష్ బదోని..
న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో అతను ఈ ఘనత సాధించాడు. ఢిల్లీ ప్రిమియర్ లీగ్ (డిపిఎల్) టి20 టోర్నమెంట్‌లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ కెప్టెన్ గా ఆయుష్ బడోని బరిలోకి దిగాడు. మ్యాచ్ లో వీరవిహారంతో చేసి 55 బంతుల్లో 165 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 19 సిక్స్ లు బాదేశాడు. కేవలం సిక్స్ లతోనే 114 పరుగులు సాధించాడు. 19 సిక్సర్లతో బడోని టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.
6️⃣ 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 🤩
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 31, 2024
There’s nothing Priyansh Arya can’t do 🔥#AdaniDPLT20 #AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad | @JioCinema @Sports18 pic.twitter.com/lr7YloC58D