ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి రికార్డు స్థాయి వాచ్‌టైం

గణాంకాలు విడుదల చేసిన ఇండియన్ క్రికెట్ కౌన్సిల్;

Update: 2025-03-21 11:35 GMT
Click the Play button to listen to article

భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (The ICC Champions Trophy) విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మార్చి 9న దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించిన సమయం రికార్డుల్లోకెక్కింది.

"మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్‌లో 137 బిలియన్ నిమిషాలు, జియోహాట్‌స్టార్‌లో 110 బిలియన్ నిమిషాల పాటు వీక్షించారు. ఈ మ్యాచ్‌కు ప్రత్యక్షంగా టీవీలో 122 మిలియన్ల వ్యూస్ కాగా.. జియోహాట్‌స్టార్‌లో 61 మిలియన్లుగా రికార్డు అయ్యింది." అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ - 2023 కంటే 23 శాతం ఎక్కువ అని పేర్కొంది.

భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్..

భారత్ vs న్యూజిలాండ్ (India vs New Zealand) మ్యాచ్ టీవీ చరిత్రలో (ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లు మినహా) రెండో అత్యధిక రేటింగ్ పొందిన వన్డేగా నిలిచింది. 230 మిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగా, వివిధ టీవీ ఛానళ్లలో 53 బిలియన్ నిమిషాల పాటు వీక్షించారు.

భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన వన్డేల్లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌లలో భారత్-పాకిస్థాన్ లీగ్ ఒకటి. బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) విడుదల చేసిన గణాంకాల ప్రకారం లీనియర్ టీవీలో ఈ మ్యాచ్‌కు 26 బిలియన్ వాచ్‌టైం నమోదైంది. ఈ మ్యాచ్, 2023 వరల్డ్ కప్‌ అహ్మదాబాద్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ కంటే 10.8 శాతం ఎక్కువ టీవీ రేటింగ్ సాధించింది. ఆ మ్యాచ్‌కు 19.5 బిలియన్ లీనియర్ వీక్షణ నిమిషాలు ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో 26.5 బిలియన్ నిమిషాలకు పెరిగింది.

ఫిబ్రవరి 23న దుబాయ్‌లో ప్రేక్షకులతో నిండిన స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను 206 మిలియన్ల మంది లీనియర్ టీవీలో వీక్షించారు. ఐసీసీ గ్లోబల్ టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యాన్ని కొనసాగించగా, విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 6 వికెట్లతో విన్నర్‌గా నిలిచింది. ప్రసార హక్కులు పొందిన జియోస్టార్ ఈ రికార్డు స్థాయి వాచ్‌టైంలో కీలక పాత్ర పోషించింది. దేశమంతటా ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానళ్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేసింది.

డిజిటల్ వేదికపై ఈ టోర్నమెంట్‌ను 9 భాషల్లో – ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, హర్యాణవీ, బెంగాలీ, భోజ్‌పురి, తమిళం, తెలుగు, కన్నడ, 4 మల్టీ-క్యామ్ ఫీడ్‌లు, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఫీడ్, మాక్స్ వ్యూ ఫీడ్‌తో మొత్తం 16 ఫీడ్‌లపై జియోహాట్‌స్టార్ ప్రత్యక్షంగా ప్రసారం చేసింది. 

Tags:    

Similar News