ఛాంపియన్స్ ట్రోఫి: నేడు భారత్ - పాక్ మ్యాచ్ టికెట్ల అమ్మకం

ఫైనల్ మ్యాచ్ టికెట్లు మాత్రం వచ్చే నెలలోనే అందుబాటులోకి;

Update: 2025-02-03 10:27 GMT

ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిలో భాగంగా భారత్ - పాక్ మధ్య గ్రూప్ స్టేజీలో జరగబోయే మ్యాచులకు నేటీ నుంచి టికెట్లను విక్రయించనున్నారు. దుబాయ్ వేదికగా తలపడబోయే ఈ మ్యాచ్ కు నేడు టికెట్లు అందుబాటులో ఉంటాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. అలాగే సెమీ ఫైనల్ 1 కోసం టికెట్లను ఇక్కడ అందుబాటులోకి తెచ్చింది.

భారత్ తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్ తో తలపడుతుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో దుబాయ్ వేదికగా అదే నెల 23న ఆడుతుంది. చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్ తో పోటీపడుతుంది.
టికెట్ల విక్రయాలు..
గల్ఫ్ సమయం ప్రకారం.. సోమవారం సాయంత్రం 5.30 కి టికెట్ల అమ్మకాలను ప్రారంభిస్తారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనరల్ స్టాండ్ టికెట్ ధరలు 125 దిర్హమ్( భారత కరెన్సీలో రూ. 3000) గా నిర్ణయించారు. ఆన్ లైన్ లో కొనుగోలు చేయడానికి ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతున్న మిగిలిన మ్యాచులకు గత వారమే టికెట్లు అమ్మకానికి తెచ్చారు. ఇక్కడ కూడా ఆన్ లైన్ లో టికెట్లు కొనుగొలు చేయవచ్చు. పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్ ల కోసం 26 నగరాల్లోని 108 సెంటర్లలో సోమవారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడానికి సమ్మతిస్తామని ఐసీసీ మీడియా ప్రకటనలో తెలిపింది.
రెండు వారాల పోటీ..
ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ టికెట్లు మాత్రం వచ్చే నెల అందుబాటులోకి వస్తాయి. మొదటి సెమీఫైనల్ లో దుబాయ్ లో ముగుస్తుంది. అక్కడ భారత్ గనుక ఆడి గెలిస్తే ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లోనే జరుగుతుంది. లేకపోతే ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లోనే ఉంటుంది.
పాకిస్తాన్ లో భద్రతా పరమైన కారణాలతో టీమిండియా అక్కడ పర్యటించడానికి నిరాకరించింది. 2008 లో ముంబై పై జరిగిన ఉగ్రదాడి తరువాత అక్కడి భారత జట్టు వెళ్లలేదు. ఇరు జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి.
2017 లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిలో భారత్ పై పాక్ గెలిచి తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫిని ముద్దాడింది.
ఉత్కంఠభరితమైన రెండు వారాల పోటీలో ప్రపంచంలోని అగ్రశ్రేణి ఎమిమిది జట్లు తలపడపోతున్నాయి. 19 రోజుల్లో 15 మ్యాచ్ లు జరుగుతాయి. అన్ని మ్యాచ్ లు లైవ్ లో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకూ జరుగుతుంది.
అయితే ఇప్పటి వరకూ పాకిస్తాన్ లో స్టేడియాలు నిర్మాణం కాలేదు. చాలా పని ఇంకా మిగిలే ఉంది. ఐసీసీ స్టేడియాల నిర్మాణాలకు సంబంధించి రెండు సార్లు గడువు పొడిగించింది. తాజాగా ఈ నెల 9 వరకూ తుది గడువు విధించింది.
Tags:    

Similar News