‘మను భాకర్’ పేరు లేకుండా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు?

మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్న క్రీడా మంత్రిత్వ శాఖ;

Update: 2024-12-24 11:24 GMT

క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు పై వివాదం చెలరేగింది. డబుల్ ఒలంపిక్ పతక విజేత మనుభాకర్ లేకుండా అవార్డు ప్రకటించే క్రీడాకారుల జాబితా సిద్దమైందని కొన్ని నివేదికలు బయటకు రావడంతో కలకలం రేగింది.

అయితే క్రీడా మంత్రిత్వ శాఖ లోని కొన్ని మూలాల ప్రకారం ఈ లిస్ట్ ఇంకా ఖరారు కాలేదని, చివరి జాబితా వెల్లడించినప్పుడు ఆమె పేరు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మరో వారంలో తుది జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది.

భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో కాంస్యం గెలుచుకుంది. ఈ ప్రదర్శనతో ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలను గెలుచుకున్న స్వతంత్ర భారతదేశపు మొదటి అథ్లెట్‌గా నిలిచింది.
అయితే బాకర్ కుటుంబ సభ్యులు సరైన విధంగా దరఖాస్తు చేయలేదని, తిరిగి మరోసారి దరఖాస్తు చేయాలని క్రీడామంత్రిత్వ శాఖ నుంచి సమాచారం వచ్చిందనే వార్తలు బయటకు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది.
" ఈ సమయంలో నామినీల తుది జాబితా లేదు. క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా ఒకటి లేదా రెండు రోజుల్లో సిఫార్సులపై నిర్ణయం తీసుకుంటారు. ఆమె పేరు తుది జాబితాలో ఉంటుంది" అని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
మెస్-అప్
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి రామసుబ్రమణ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల ప్యానెల్ అవార్డు ఎంపిక కమిటీ క్రీడాకారులను ఎంపిక చేస్తారు. ఇందులో మహిళా హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ వంటి మాజీ అథ్లెట్లు కూడా ఉన్నారు. మంత్రిత్వ శాఖ నిబంధనలు క్రీడాకారులు సమాఖ్యలు, ఇతర సంస్థలపై ఆధారపడకుండా స్వీయ-నామినేట్( అవార్డు ఇవ్వడానికి తనే స్వయంగా పేరును నామినేట్ చేసుకోవచ్చు) చేయడానికి అనుమతిస్తాయి. అయితే, దరఖాస్తుదారులలో లేని పేర్లను సైతం పరిగణనలోకి తీసుకోవడానికి ఎంపిక కమిటీకి అనుమతి ఉంది.
బాకర్ అవార్డు కోసం దరఖాస్తు చేయలేదని మంత్రిత్వ శాఖ వాదించగా, మర్చంట్ నేవీలో చీఫ్ ఇంజనీర్ అయిన ఆమె తండ్రి రామ్ కిషన్ భాకర్ మాత్రం పేరు ఇచ్చామని తెలిపారు. "ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించినా, ఖేల్ రత్న అవార్డు కోసం మను పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే భారతదేశంలో ఒలింపిక్ క్రీడలు పతకాలకు విలువ లేదు. మీ దేశం కోసం ఆడి, రివార్డులు గెలుచుకోవడంలో ప్రయోజనం లేదు. గుర్తింపు కోసం వేడుకోండి." రామ్ కిషన్ పిటిఐకి చెప్పారు.
" ఆమె గత 2-3 సంవత్సరాలుగా ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ అని అన్ని అవార్డుల కోసం నిరంతరం దరఖాస్తు చేసుకుంటోంది. దానికి నా దగ్గర రుజువు ఉంది. ఈసారి కూడా ఆమె దరఖాస్తు చేస్తుందనే నమ్మకం ఉంది కానీ నేను చూపించలేనని అన్నారు.
" కానీ ఆమె( మనుభాకర్) పేరు లేనప్పటికీ, ఆమె సాధించిన విజయాలను కమిటీ పరిశీలించాలి" అని అతను తండ్రి జాతీయ మీడియాకు చెప్పారు. ఈ గందరగోళానికి బ్యూరోక్రసీయే కారణమని ఆరోపించారు.
ఖేల్ రత్న కోసం...
దేశానికి వరుసగా రెండో ఒలింపిక్ కాంస్య పతకాన్ని అందించిన భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌ను ఖేల్ రత్నకు కమిటీ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. పారిస్ పారాలింపిక్స్‌లో ఆసియా రికార్డుతో పురుషుల హైజంప్ T64 క్లాస్‌లో స్వర్ణం సాధించిన పారా అథ్లెట్ ప్రీవీన్ కుమార్ కూడా ఈ గౌరవానికి నామినేట్ అయ్యారు. అవార్డుల కమిటీ అర్జున అవార్డుల కోసం 30 మంది క్రీడాకారులను సిఫార్సు చేసింది, ఇందులో పారా విభాగాలకు చెందిన 17 మంది ఉన్నారు.
పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్యం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్, పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో కాంస్య పతక విజేత షూటర్ స్వప్నిల్ కుసాలే, భాకర్ మిక్స్‌డ్ టీమ్ భాగస్వామి సరబ్జోత్ సింగ్‌లను అర్జున అవార్డుకు సిఫార్సు చేశారు. కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు సభ్యులు జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, రాజ్‌కుమార్ పాల్, అభిషేక్, మరో ఆటగాడిని కూడా అర్జున అవార్డుకు సిఫార్సు చేశారు.
Tags:    

Similar News