శ్రేయర్ అయ్యార్ కు పిలుపురాకపోవడం పై అభిమానుల అసంతృప్తి
సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-17 13:53 GMT
ఇంగ్లాండ్ లో వచ్చే నెల నుంచి పర్యటించబోయే భారత జట్టుకు ప్రాక్టీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఇండియా- ఏ జట్టులో శ్రేయస్ అయ్యార్ చోటు లేకపోవడంపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ సీమ్ పరిస్థితులకు అలవాటు కావాలనే లక్ష్యంతో అభిమన్యు ఈశ్వరన్ నేతృత్వంలోని ఇండియా ఏ జట్టు మూడు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనుంది. కానీ ఇందులో ఫామ్ లో ఉన్న అయ్యర్ కు చోటు లభించలేదు.
మంచి దేశీయ సీజన్..
దేశీయ సీజన్ లో మంచి పరుగులు సాధించి, ఫామ్ చాటుకున్నప్పటికీ శ్రేయర్ అయ్యార్ ఇండియా- ఏ జట్టులోకి ఎంపిక కాలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ తనను తాను నిజమైన నాయకుడిగా నిరూపించుకున్నాడు.
పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ లకు అర్హత సాధించే దిశగా ఉంది. ఈ సీజన్ లలో 11 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ ఏడు విజయాలు సాధించగా, కేవలం మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. టెస్ట్ సిరీస్ కోసం అయ్యార్ ఎంపికయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఏ జట్టులోకి చోటు దక్కించుకోవడం ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా రంజీ ట్రోఫిలో అతను సగటున 68.57 పరుగులు సాధించాడు. అయ్యర్ ను ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియా వెంటనే స్పందించింది.
ఆగ్రహం..
ఛాంపియన్స్ ట్రోఫికి ముందు వన్డే జట్టులో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న శ్రేయాస్ ను వన్డే జట్టు ప్రారంభ తుది జట్టు నుంచి తొలగించిన విషయాన్ని సోషల్ మీడియాలో చాలామంది వినియోగదారులు గుర్తు చేసుకుంటున్నారు.
విరాట్ కోహ్లి గాయంతో తొలి మ్యాచ్ లో దూరం కావడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన అయ్యార్.. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో బాగా రాణించాడు. తరువాత ఛాంపియన్స్ ట్రోఫి గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
అయితే అతని ప్రదర్శనలతో పాటు సెలెక్టర్లు అతన్ని మినహయించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అతని జట్టు పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం ఐపీఎల్ లో బాగా రాణిస్తోంది. ఆ జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించవచ్చు.
వారు ఫైనల్స్ కు చేరుకుంటే అయ్యార్ జూన్ 3 వరకూ ఐపీఎల్ లో ఆడతాడు. అంటే మే 30 నుంచి ప్రారంభం అయ్యే మూడూ అనధికారిక టెస్ట్ లలో రెండింటిని అతను కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల ప్లే ఆఫ్ లలో లేని లేదా ఐపీఎల్ లో కూడా పాల్గొనని జట్లను ఎంచుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది.