గంభీర్ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి.. కెప్టెన్ మాత్రమే బాస్ అని..

ఛాంపియన్ ట్రోఫిలో అయినా జట్టు పరిస్థితి మారాలి;

By :  R Kaushik
Update: 2025-01-15 12:12 GMT

చాలా కాలం తరువాత భారత జట్టు అమెరికా- వెస్టీండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లో విజేతగా నిలిచింది. ఈ విజయం తరువాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ సహ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పదవీ విరమణ చేశాడు.

తరువాత గంభీర్ శకం మొదలైంది. కానీ ఆరునెలల కాలంలోనే టీమిండియాలో అంతా గందరగోళం నెలకొంది. శ్రీలంక పర్యటనలో భారత్ జట్టు వన్డే సిరీస్ ను కోల్పోయింది. దాదాపు మూడు దశాబ్ధాల తరువాత వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఆ తరువాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్ ను 0-3 తో ఓటమి. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫిలో 3-1 తో ఓటమి తో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

ఇంతకుముందు కోచ్ గంభీర్ కు ఎలాంటి అనుభవం లేదు. తన కోచింగ్ స్టాప్ లో టెన్ డస్కాటే, అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్ లాంటి సపోర్టింగ్ స్టాప్ ను తీసుకున్నాడు. అయితే అంతకుముందు భారత్ కు కోచ్ లు గా పనిచేసిన రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, ద్రవిడ్ సారథ్యంలోని సాధించిన విజయాలను పునరావృతం చేయలేకపోయాడు.
ఈ అపజయాలకు కారణం గంభీరే ?
అయితే ఈ అపజయాలకు కేవలం గంభీర్, అతని స్టాప్ ను బలి చేయడం కరెక్ట్ కాదు. దాదాపు ఒకటిన్నర దశాబ్ధాలుగా ఇద్దరు సీనియర్ క్రికెటర్లు ఇంకా ఆడుతున్నారు.. ఒక విధంగా చెప్పాలంటే ఏలుతున్నారు. అలాగే క్రీడ వ్యవస్థ దేశంలోనే అత్యంత ప్రతిభావంతులను గుర్తించే ఏర్పాట్లు చేసుకుంది. ఇక్కడ వంశపారంపర్యతకు ఎలాంటి అవకాశం లేదు. అయినప్పటికీ కొన్ని పరాజయాలు టీమ్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలు మాత్రం జట్టు సంతోషంగా లేదనే వాస్తవాన్ని సూచిస్తున్నాయి.
గంభీర్ ది విపరీతమైన పాత్ర. అతను గొప్ప పేరు మోసిన ఆటగాడు ఏ మాత్రం కాదు. తన ప్రతిభ కంటే వివాదాస్పద సమాధానాలతో ఎక్కువ పాపులర్ అయ్యాడు. విమర్శకుల నోరు మూయించడం అతనికి సరదా.
ప్రధాన కోచ్ సీనియర్ ఆటగాళ్ల సంబంధం..
కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత వస్తున్న ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇదీ అధికారిక కారిడార్ లో ఆందోళన కలిగిస్తోంది. ఫలితాల కంటే బీసీసీఐ దృష్టిని ఆకర్షించిన కొన్ని ఇతర పరిణామాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కోచ్ తో సహ ఇతర సిబ్బందితో ఆటగాళ్ల సంబంధాలు ఎలా ఉన్నాయన్నది. వాస్తవానికి అందరి దృష్టి దీనిపైనే పడింది.
కమ్యూనికేషన్ ఏదైనా మంచి సంబంధానికి పునాది. నిజాయితీ, పారదర్శకత ఏ బంధానికి అయినా మంచి ఫలితాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. కోచ్ లు నుంచి వచ్చే సూచనలు ఒపెన్ గా, స్థిరంగా, సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఊహగానాలు, అస్పష్టతకు ఆస్కారం ఉండదు. ఇటీవల కాలంలో జట్టులో ఎలాంటి వాతావరణం ఉందో ఎవరికి తెలియదు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు అండగా నిలబడటం, విజయాలు ఉన్నప్పుడు ఆస్వాదించడం, జట్టుగా కలిసి ఉండటం అనేది కలిసి వస్తుంది. ఇది మనమంతా ఓ కుటంబం అనే భావనను తీసుకువస్తుంది. ఆటగాళ్లంతా హోటల్ రూమ్ లను పంచుకోవడం, కలిసి డ్రెస్సింగ్ రూమ్ అభిప్రాయాలను మార్చుకోవడం, దాదాపుగా అందరూ ఒకేలా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ లోపం ఈ మధ్య పర్యటనల్లో కనిపిస్తోంది.
ఇద్దరు కీలక ఆటగాళ్లు ఈ సిరీస్ ల్లో విఫలమయ్యారు. ఇంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితి ఉండి తరువాత సర్దుకుంది. కొంతకాలం నుంచి సరిగా ప్రదర్శన చేయని ఆటగాళ్లు కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో ఈ లోపం కనిపించింది. నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్ మంచి ఆటగాళ్లుగా పరుగులు సాధించారు. అంతే మరో ఆటగాడు రాణించినట్లు కనిపించలేదు.
ముంబై సమీక్షసమావేశం..
ఆస్ట్రేలియాలో ఓటమి తరువాత బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది. దీనికి కెప్టెన్ రోహిత్, గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో పాటు బోర్డులోని ఉన్నతాధికారులు హజరయ్యారు. దాదాపుగా ఆరు గంటలుగా చర్చలు జరిగాయి. ఇందులో కుటుంబాలతో కీలక ఆటగాళ్లు ప్రయాణం చేయడం వంటి వాటిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
అలాగే ఆటగాళ్లలందరిలో ఐక్యత చేసుకోవడానికి అంతా ఒకే విమానంలో ప్రయాణం చేయాలని అప్రకటిత ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా అభిమన్యు ఈశ్వరన్, సర్పరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ ఆడకుండానే టూర్ నుంచి నిష్క్రమించారు.
ఐపీఎల్లో గంభీర్ విజయం..
భారత్ తదుపరి ఛాంపియన్స్ ట్రోఫి లో ఆడబోతోంది. అయితే ఈ సమయాల్లో ఆటగాళ్లు అందరూ దేశవాళీ క్రికెట్ లో ఆడాలని గంభీర్ ఆటగాళ్లను కోరారు. అక్కడ ఆడకుంటే జట్టులో చోటు ఉండదని ఉన్నారు. గంభీర్ లో ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ , కోల్ కత నైట్ నైడర్స్ లలో మెంటార్ గా అద్భుత ఫలితాలు సాధించాడు.
కానీ ఉన్నత స్థాయిలో మ్యాన్ మేనేజిరియన్ నైపుణ్యాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. రవిశాస్త్రి , ద్రవిడ్.. రోహిత్, కోహ్లికి ఏదంటే అదే అన్నారు. కానీ కోహ్లి కెప్టెన్ గా ఉన్న సమయంలో కుంబ్లే కోచ్ గా ఉన్నారు. ఆ సందర్బంలో కోహ్లితో అభిప్రాయ బేధాల కారణంగా తన కోచ్ పదవికి రాజీనామా చేశారు.
అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ బాస్, కోచ్ ఫెసిలిటేటర్ అని పదాన్ని గంభీర్ అర్థం చేసుకోవాలి. మైదానంలో ఉన్న వారు లీడర్ గా పాత్ర పోషించాల్సి ఉంటుంది. డగౌట్ లో ఉన్నవాళ్లు ఏం చేయగలరో మనకు తెలుసు.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు అడ్డదారిలో ఉంది. కానీ అది ఇంకా తిరిగి రాని స్థితిలోకి రాలేదు. వచ్చే నెల ఛాంపియన్ ట్రోఫితో కెప్టెన్లు, కోచ్ లు కలిసికట్టుగా ముందుగా సాగాలి. ఇదే మంచి పరిణామానికి దారి తీస్తుంది. లేదంటే చెప్పాల్సిన పనిలేదు.
Tags:    

Similar News