కోహ్లి పై ఐసీసీ చర్యలు.. డీ మెరిట్ పాయింట్ తో పాటు..

సామ్ కాన్ స్టాస్ ను భుజంతో ఢీ కొట్టిన కింగ్..;

Update: 2024-12-26 13:33 GMT

మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో యువ ఆటగాడు కోహ్లి- ఆసీస్ ఆటగాడు సామ్ కాన్ స్టాస్ మధ్య  గొడవ జరిగిన సంగతి తెలిసిందే. కింగ్ కోహ్లి ధాటిగా ఆడుతున్న సామ్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా తన భుజంతో సామ్ భుజాన్ని ఢీ కొట్టాడు.

ఈ కారణంగా మ్యాచ్ రెఫరీ కోహ్లి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాడు. అలాగే తన ఖాతాలో ఓ డీ మెరిట్ పాయింట్ విధించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లోని 10వ ఓవర్ తర్వాత ఇక్కడ జరుగుతున్న నాల్గవ టెస్టు తొలిరోజు ఆటగాళ్ళు మరో ఓవర్ కోసం సన్నద్ధం అవుతుండగా ఈ గొడవ జరిగింది.

మైదానంలోని అంపైర్లు జోయెల్ విల్సన్ - మైఖేల్ గోఫ్, థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, నాల్గవ అంపైర్ షాన్ క్రెయిగ్ లు కోహ్లి ఐసిసి ప్రవర్తనా నియమావళి లెవల్ 1ను ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపారు. ఆట ముగిశాక మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రతిపాదించిన ఆంక్షలను అంగీకరించాడు.
" ఐసిసి ప్రవర్తనా నియమావళి లెవల్ 1 ను ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీకి అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా. ఒక డీమెరిట్ పాయింట్ చేర్చారు " అని ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. "మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రతిపాదించిన ఆంక్షలను కోహ్లీ అంగీకరించినందున అధికారిక విచారణ అవసరం లేదు" అని ప్రకటన సారాంశం భుజాలతో ఢీ కొట్టిన తరువాత ఇరు ఆటగాళ్లు మాటలు మార్చుకున్నారు. ఉస్మాన్ ఖవాజ వీరిని విడదీయడానికి ప్రయత్నించారు.
ఆన్-ఫీల్డ్ అంపైర్లు కూడా ఇద్దరితో ఒక మాట చెప్పారు. తరువాత పరిస్థితి సాధారణంగా మారింది. స్టంప్స్ తర్వాత విలేఖరులతో మాట్లాడిన కాన్స్టాస్, కోహ్లి తనతో ఢీకొట్టాడని, అయితే అది ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పాడు. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య ఉద్వేగాలు రగిలాయని చెప్పాడు. తన తొలి మ్యాచ్ లోనే సామ్ అర్థశతకం సాధించాడు. ముఖ్యంగా బూమ్రా లయను దెబ్బతీయడంలో సఫలం అయ్యాడు.
కోహ్లిపై విమర్శలు..
మైదానంలో కోహ్లి ప్రవర్తించిన తీరుపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శలు గుప్పించాడు. ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కోహ్లి కావాలనే సామ్ ను ఢీ కొట్టాడని అన్నారు. అంపైర్లు ఈ ఘటన వీడియోను చూసే ఉంటారని అనుకుంటారని అభిప్రాయపడ్డారు. కోహ్లి కెప్టెన్సీలో సారథ్యం వహించిన భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి రన్-ఇన్ అనవసరమని అన్నారు.
" ఒక లైన్ ఉంది. మీరు ఆ లైన్‌ను దాటకూడదు. అది అనవసరం, పూర్తిగా అనవసరం. మీరు దానిని చూడకూడదు. విరాట్ సీనియర్ ఆటగాడు అని మీకు తెలుసు, అతను జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు" అని రవిశాస్త్రి చెప్పాడు.
Tags:    

Similar News