ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి: భారత జెండా ఎగరవేయని పాకిస్తాన్

లాహోర్ లో జరిగిన కార్యక్రమంలోనూ ఇలాగే వ్యవహరించిన దాయాదీ;

Update: 2025-02-17 12:05 GMT
క్రికెట్ గ్రౌండ్

భారత్ పై అక్కసును పాకిస్తాన్ మరోసారి వెళ్లగక్కింది. పాక్ వేదికగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి జరగనున్న సంగతి తెలిసిందే. దీనిలో ఆడుతున్న సభ్యదేశాల జాతీయజెండాలను ఆతిథ్య దేశం ఎగరవేయాల్సి ఉంటుంది.

కానీ పాకిస్తాన్ ఇందుకు భిన్నంగా భారత్ లేకుండా కేవలం ఏడు దేశాల జెండాలనే స్టేడియంలో ఎగరవేసింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో ఓ యూజర్ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మన జాతీయ జెండా లేదు. మిగిలినవన్నీ కనిపించడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది.
భద్రతా కారణాల రీత్యా భారత జట్టు పాకిస్తాన్ లో మ్యాచులు ఆడటానికి నిరాకరించింది. ముంబాయి పై ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు.
ప్రస్తుతం మన జట్టు మ్యాచులన్నీ కూడా దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. మిగిలిన దేశాల మ్యాచులన్నీ కూడా కరాచీ, రావల్పిండి, లాహోర్ లలో జరుగుతున్నాయి. పాకిస్తాన్ కు వెళ్లనందుకే జాతీయ జెండాను ఉద్దేశపూర్వకంగా ఎగరవేయలేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
లాహోర్ లో కూడా కనిపించని జాతీయజెండా
ఛాంపియన్ ట్రోఫికి ముందు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మరో కార్యక్రమంలో ఐసీసీ ఛాంఫియన్ ట్రోఫిలో ఆడుతున్న అన్ని దేశాల జాతీయ జెండాలు కనిపించగా, భారత్ జెండా లేదని మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎనిమిది సంవత్సరాల విరామం తరువాత ఛాంపియన్ ట్రోఫిని నిర్వహించాలని ఐసీసీ భావించి పాకిస్తాన్ కు ఆతిథ్య హక్కులు ఇచ్చింది. ఇక్కడ ఈ ట్రోఫి నిర్వహించడం ఇదే మొదటి సారి.
ఈ మిని సంగ్రామం బుధవారం నుంచి అంటే ఫిబ్రవరి 19 ప్రారంభం అవుతుంది. మొదటి మ్యాచులో ఢిపెండింగ్ ఛాంపియన్ పాక్ తో న్యూజిలాండ్ కరాచీ వేదికగా తలపడుతుంది. చిరకాల ప్రత్యర్థులై భారత్ , పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగుతుంది.
Tags:    

Similar News